తెలంగాణ

telangana

ETV Bharat / business

టమాట ధరలకు రెక్కలు- కేజీ రూ.100

దేశంలో టమాట ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇంఫాల్, అయిజోల్, మాల్దా నగరాల్లో వీటి ధర రూ.100కు చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన నగరాలైన దిల్లీ, చెన్నై, ముంబయి, కోల్​కతాలోనూ టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Tomato prices touch Rs 100 in Malda, Aizawl, Imphal: Govt data
టమాట ధరలకు రెక్కలు- కేజీ రూ.100

By

Published : Sep 16, 2020, 5:52 AM IST

దేశంలో టమాట ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు సరఫరాలో కొరత ఏర్పడటం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రిటైల్​ మార్కెట్లలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మిజోరం రాజధాని అయిజోల్, మణిపుర్​ రాజధాని ఇంఫాల్​ సహా పశ్చిమ్ బంగలోని మాల్దా నగరాలలో టమాట ధరలు కిలోకు రూ.100కి చేరుకున్నాయి.

ఈ మేరకు టమాట, ఉల్లి, ఆలూ సహా 22 అత్యవసర సరకుల ధరలపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం దేశంలో టమాట సగటు ధర కిలోకు రూ.50గా ఉంది. ఆలూ, ఉల్లి సగటు ధరలు కేజీకి రూ.35గా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి గరిష్ఠ ధర రూ. 60గా ఉంది.

దిల్లీ, ముంబయి, కోల్​కతా, చెన్నై నగరాల్లో టమాట ధరలు వరుసగా రూ.63, రూ.68, రూ.80, రూ.50గా ఉన్నాయి. అయితే వీధి వ్యాపారులు మాత్రం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలతో పోలిస్తే ఎక్కువ ధరకే వీటిని విక్రయిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details