దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు ఉందనే కారణంతో 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా కంపెనీలకు భారీ నష్టం కల్గించబోతోందని తేలింది. టిక్‌టాక్‌సహా మరో రెండు యాప్‌లను కల్గి ఉన్న దాని మాతృ సంస్ధ బైట్‌డాన్స్‌కు.. నిషేధం వల్ల 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఆ సంస్ధ అంచనా వేస్తోన్నట్లు ఓ చైనా మీడియా నివేదిక తెలిపింది. ఈ మొత్తం మిగతా అన్ని యాప్‌లకు కల్గే నష్టం కంటే ఎక్కువ అని వెల్లడించింది.
భారత్ అసాధారణ నిర్ణయంతో టిక్‌టాక్‌కు భారీ దెబ్బ
భారత్ తీసుకున్న అసాధారణ నిర్ణయం కారణంగా టిక్‌టాక్‌సహా మరో రెండు యాప్‌లను కల్గి ఉన్న దాని మాతృ సంస్ధ బైట్‌డాన్స్‌కు 6 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లితుందని చైనా మీడియా నివేదిక స్పష్టం చేసింది. ఈ మొత్తం మిగతా అన్ని యాప్‌లకు కల్గే నష్టం కంటే ఎక్కువ అని వెల్లడించింది.
భారత్ అసాధారణ నిర్ణయంతో టిక్‌టాక్‌కు భారీ దెబ్బ
యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం అసాధారణమైనదని తెలిపిన ఈ నివేదిక.. ఇది టిక్‌టాక్‌కు భారీ దెబ్బ అని పేర్కొంది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో టిక్‌టాక్‌యాప్‌కు భారత్‌లో 611 మిలియన్ల డౌన్‌లోడ్‌లు నమోదు కాగా, ప్రపంచ మార్కెట్‌లో ఇది 30శాతం అని పేర్కొంది. భారత్ నిర్ణయం వల్ల ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని వెల్లడించింది.