తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లో 'టిక్​ టాక్' మాతృసంస్థ భారీ పెట్టుబడులు

టిక్​టాక్​ మాతృ సంస్థ బైట్​డ్యాన్స్ వచ్చే 3 సంవత్సరాలకుగానూ​ భారత్​లో రూ. 6 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

భారత్​లో 'టిక్​ టాక్' మాతృసంస్థ భారీ పెట్టుబడులు...

By

Published : Apr 20, 2019, 5:12 PM IST

భారత్​లో టిక్​టాక్​ నిషేధానికి గురైనప్పటికీ మాతృసంస్థ బైట్​డ్యాన్స్ ఇక్కడి మార్కెట్​పై​ భారీగా ఆశలు పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో భారత్​లో రూ.6వేల కోట్లు(100 బిలియన్​ డాలర్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్​ తెలిపారు.

''ఇటీవల జరిగిన పరిణామాలు నిరాశకు గురిచేశాయి. కానీ ఈ సమస్య పరిష్కారమవుతుందన్న ఆశావహ దృక్పథంలో ఉన్నాం''
- బైట్​డ్యాన్స్​ డైరెక్టర్​

ఈ సంవత్సరం చివరి వరకు ఉద్యోగుల సంఖ్యను 1000కి పెంచుకోనుంది కంపెనీ. టిక్​టాక్​కు భారత్​లో 1.2 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. యువతలో ఈ యాప్​ పట్ల మంచి ఆదరణ ఉంది.

నిషేధం..

అశ్లీలత ఎక్కువైందన్న కారణంతో.. మద్రాసు హైకోర్టు ఏప్రిల్​ 3న టిక్​టాక్​ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది బైట్​డ్యాన్స్​. ఈ పిటిషన్​పై ఏప్రిల్​ 22న సుప్రీంకోర్టులో, ఏప్రిల్​ 24న మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details