ఎయిర్ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. కొనుగోలు దారులు ఆసక్తి చూపుతుండటమే ఇందుకు కారణమని తెలిపారు. మరిన్ని సంవత్సరాలు ఎయిర్ఇండియా సేవలందించాలని ఆకాంక్షించారు.
ఎయిర్ ఇండియా ఉద్యోగులకు మంత్రి భరోసా - air india disinvestment plan
ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ధీమా వ్యక్తంచేశారు. యాజమాన్యం మారినా ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు.
ఎయిర్ఇండియా
ఎయిర్ఇండియా ఉద్యోగులకు కూడా భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి. యాజమాన్యం మారినప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాలే ప్రాథమ్యాలుగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.
ప్రైవేటీకరణ నేపథ్యంలో తమ భవితవ్యంపై కొన్ని నెలలుగా ఎయిర్ఇండియా ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Last Updated : Mar 1, 2020, 3:02 PM IST