ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే వార్తలు.. కరోనా రాకుండా తరచూ చేతులు కడుక్కోండి. ఎక్కడికెళ్లినా హైజిన్‌గా ఉండండి అంటూ ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అయితే మనం ఎక్కడికెళ్లినా.. ఏం చేస్తున్నా మనతో పాటు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉంటోంది.
ఎక్కడ పడితే అక్కడ ఫోన్ వాడుతున్నాం. ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడెక్కడో ఫోన్‌ను పెడుతుంటాం. కానీ ఒక్క సారి కూడా ఫోన్‌ను కడగం. ఎందుకంటే ఫోన్‌ను కడిగితే అవి పని చేయకుండా పోతాయి. మరి ఇలాంటి సమయాల్లో ఫోన్లపై ఎంత దుమ్ము, వైరస్లు ఉంటాయో? ఎప్పుడైనా ఆలోచించారా? వాటి ద్వారా వైరస్లు వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేవు. మరి దీనికి పరిష్కారం ఉందా? అవును ఇందుకు ఓ పరిష్కారం ఉంది. అదే 'స్మార్ట్‌ఫోన్ సోప్'.
ఈ సబ్బుతో ఫోన్లో ఉన్న వైరస్, దుమ్ము 99.9 శాతం పోతుంది. సబ్బు వాడితే ఫోన్ పని చేస్తుందా? అనేగా మీ సందేహం.. అలాంటిదేమీ ఉండదు ఇది పేరుకే సబ్బుకాని నిజమైన సబ్పుకాదు. ఫోన్లను దుమ్ము ధూళి సహా వైరస్ (భౌతిక) నుంచి రక్షించేందుకు ఉన్న ఓ సదుపాయం. అతినీలలోహిత (యూవీ)కిరణాల ద్వారా ఫోన్లలో ఉండే వైరస్‌ను తొలిగిస్తుంది.
దీన్ని ఎలా వాడాలి?
దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ సోప్ డివైజ్‌లో స్మార్ట్‌ఫోన్ పెట్టేందుకు ఓ కంపార్ట్మెంట్ ఉంటుంది. దీనికి ఓ చివర ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. మీరు పడుకునే ముందు మీ ఫోన్‌ను ఆ బాక్సులో ఉంచి.. ఛార్జింగ్ కేబుల్‌ను మీ ఛార్జర్‌కు కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత బాక్సుకు లైటింగ్ లోగోతో ఉన్న బటన్‌ను నొక్కాలి. దీనితో మీ ఫోన్ ఛార్జింగ్ అవ్వడం సహా.. అందులో ఉన్న వైరస్ కూడా పూర్తిగా చనిపోతుంది.
ఫోన్లో బ్యాక్టీరియా చనిపోవడమేంటి?