వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్. ఆదివారం జరిగిన విచారణలో కొచ్చర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ముఖ్యంగా ఆమె భర్త మెనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న న్యూ పవర్ సంస్థతో జరిపిన అక్రమ లావాదైవీలపై ప్రశ్నలు సంధించారు ఈడీ అధికారులు. నేటి విచారణలోనూ దీనిపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.
శుక్రవారం కొచ్చర్, వీడియోకాన్ ప్రతినిధి వేణుగోపాల్ నివాసంలో సోదాలు జరిపిన ఈడీ మరుసటి రోజే విచారణకు హాజరు కావాలంటూ తాఖీదులు పంపింది. ఈ పరిణామంతో... సోదాలలో కీలక పత్రాలు ఏమైనా దొరికాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.