తెలంగాణ

telangana

ETV Bharat / business

వర్షా కాలం వచ్చేసింది.. వాహన బీమా సరిచూసుకోండి! - ఇంజన్ ప్రోటెక్షన్ కవర్ పూర్తి వివరాలు

వర్షా కాలం రోడ్లపై నీరు నిలిచిపోతే ట్రాఫిక్ సమస్య సర్వ సాధారణం. ఇయితే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం వాహన డ్యామేజీ. ఈ విషయంలో బీమా తీసుకోవటం ద్వారా నిశ్చింతగా ఉండవచ్చు. అయితే బీమా ఉన్నా చిన్న చిన్న పొరపాట్ల కారణంగా.. చిక్కులు తప్పవు. అలాంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Precautions to vehicle Insurance
వాహన బీమా విషయంలో జాగ్రత్తలు

By

Published : Jun 12, 2021, 9:25 AM IST

వర్షా కాలంలో వాహనదారులకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్ని సార్లు రోడ్లపై భారీగా నీరు నిలవటం, వరదలు రావటం వంటి కారణాలతో వాహనం డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజీ వల్ల జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంది.

మన దేశంలో వాహనం రోడ్డుపై తిరగాలంటే థర్డ్ పార్టీ బీమా తప్పకుండా ఉండాలి. ఈ కారణం వల్ల చాలా మంది థర్డ్ పార్టీ బీమాతోనే సరిపెట్టుకుంటారు. అయితే ఇది ప్రమాదం జరిగిన సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది. వర్షం వల్ల ఏర్పడే డ్యామేజీకి వర్తించదు.

వరదల వల్ల వాహనం నీటిలో మునిగితే విడిభాగాలు దెబ్బ తింటాయి. వీటి రిపేరుకు ఎక్కువ ఖర్చు కావొచ్చు. వాహనానికి జరిగిన నష్టానికి సంబంధించి బీమా తీసుకోవాలి. దీన్నే సొంత డ్యామేజీ(ఓన్ డ్యామేజీ) పాలసీ ఉంటారు. థర్డ్ పార్టీ, ఓన్ డ్యామేజీ కలిపి సమగ్ర(కాంప్రెహెన్సివ్) బీమా అంటారు.

క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు..

హైదరాబాద్​లో గతేడాది వరదలు వచ్చినప్పుడు చాలా వాహనాలు నీటిలో మునిగిపోయాయి. బీమా తీసుకున్నప్పటికీ క్లెయిమ్ సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంజిన్ డ్యామేజీ, విడిభాగాల రిప్లేస్మెంట్ లాంటి వాటి విషయంలో బీమాకు సంబంధించి చిక్కులు ఎదుర్కొన్నారు.

సమగ్ర బీమా ద్వారా కొన్నింటికి బీమా వర్తించదు. ఈ సమస్యలను అధిగమించేందుకు క్లెయిమ్ సమయంలో చిక్కులు రాకుండా ఉండేందుకు కొన్ని యాడ్ ఆన్​లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్

నీటిలో వాహనం మునిగినప్పుడు లేదా జలమయమైన రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇంజిన్​లోకి నీరు చేరే అవకాశం ఉంటుంది. వాహనంలోని నీరు పూర్తిగా ఆరి పోకుండా స్టార్ట్ చేసినట్లయితే ఇంజిన్ డ్యామేజీ అవుతుంది. వాహనంలో ఇంజిన్​ ప్రధాన భాగం కాబట్టి.. దీనిని రిపేరు చేసేందుకు ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.

సొంత డ్యామేజీ కోసం తీసుకున్న బీమా ద్వారా ఈ తరహా ఇంజిన్ రిపేర్లకు కవరేజీ రాకపోవచ్చు. అయితే కొన్ని సార్లు వాహనదారుడే నీరు ఆరిపోయే వరకు ఆగకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కంపెనీలు క్లెయిమ్​కు నిరాకరిస్తుంటాయి.

యాడ్​ అన్​తో పరిష్కారం..

ఇంజిన్​కు సంబంధించి అన్ని డ్యామేజీలకు బీమా అందేలా ప్రొటెక్షన్ యాడ్ ఆన్ తీసుకోవచ్చు. ఇంజిన్ రిపేరుపై వెచ్చించే దానిలో చాలా తక్కువకే ఈ కవరేజీ లభిస్తుంది.

ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ లేకపోయినట్లయితే వాహనం నీటిలో మునిగిన సందర్భంలో వాహనాన్ని స్టార్ట్ చేయకుండా గ్యారేజీకి తరలించాలి. ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

సున్నా తగ్గుదల(జీరో డిప్రిసియేషన్) కవర్​

వరదల్లో చిక్కుకున్నట్లయితే విడిభాగాలు డ్యామేజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సొంత డ్యామేజీ బీమా తీసుకున్నట్లయితే తగ్గించిన వాహన విలువ ఆధారంగా బీమా మొత్తం ఉంటుంది. దీనివల్ల విడిభాగాలపై పూర్తి మొత్తం బీమా రాదు.

జీరో డిప్ పాలసీ ద్వారా విడిభాగాల మొత్తం ఖర్చును కంపెనీలే భరిస్తాయి. బేసిక్ పాలసీలో 15-20 శాతం దీని ప్రీమియం ఉంటుంది.

రోడ్ సైడ్ అసిస్టెన్స్​

వర్షా కాలంలో రోడ్​పై కారు ఆగిపోయినట్లయితే(బ్రేక్ డౌన్) సహాయం పొందటం కష్టం అవుతుంది. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్ ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరలోని వర్క్ షాప్​కు కారును తీసుకెళ్లొచ్చు.

ఈ యాడ్ ఆన్ వానా కాలమే కాకుండా ప్రతి కాలంలో ఉపయోగపడుతుంది. కొన్ని బీమా కంపెనీలు ఈ రైడర్ ద్వారా టైర్​లో గాలి పోవటం, బ్యాటరీ జంప్ స్టార్ట్ లాంటి సేవలను కూడా అందిస్తాయి. అన్ని రైడర్లలో ఇదే తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details