ముహురత్ ట్రేడింగ్ అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న సంప్రదాయం. ముహురత్ ట్రేడింగ్ మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. తర్వాత 1992లో జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ స్థాపించినప్పుడు అదే ఏడాది ఈ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ ట్రేడింగ్ తో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు.
సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ చేసే ట్రేడింగ్ అని, హిందూ కొత్త సంవత్సరమైన సంవత్ ప్రారంభాన్ని చేసుకోవటం అని ట్రేడర్లు నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ముహురత్ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసిన పని మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ట్రేడింగ్ ప్రారంభమవగానే కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. ఈ గంట సమయంలో ట్రేడింగ్ చేసిన వారికి సంవత్సరం మొత్తం ఎక్కువ లాభాలు వస్తాయని ఒక నమ్మకం ఉంది. ఈ సమయంలో కొంత మొత్తంలో కొనుగోలు చేయటం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఇస్తుందని కొంత మంది నమ్ముతుంటారు.