ప్రపంచంలోనే పేరెన్నికగన్న దిగ్గజ కంపెనీల సీఈఓలుగా(Indian origin CEOs in World) పలువురు భారతీయులు రాణిస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి సంస్థలను అద్భుతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో(Indian origin CEOs list) ట్విట్టర్‌కు కొత్త సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్ (45) చేరారు. సీఈఓ హోదాలో ఏడాదికి ఒక మిలియన్ డాలర్లు(రూ.7 కోట్లు 40 లక్షలు) వేతనం అందుకోకున్నారు. అయితే పరాగ్నే ఎందుకు సీఈఓగా నియమించారన్న విషయంపై స్పష్టత ఇచ్చారు ఆ సంస్థ మాజీ సీఈఓ జాక్ డోర్సే.
"సీఈఓగా కావడానికి పరాగ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. బోర్డు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కఠినమైన ప్రక్రియను పూర్తి చేసింది. ఏకగ్రీవంగా పరాగ్‌ను నియమించింది. ఆయన కంపెనీని, దాని అవసరాలను ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో నాకు తెలుసు. అందుకే పరాగ్‌ను సీఈఓగా ఎంపిక చేశాం. కంపెనీని అభివృద్ధికి సహాయపడిన ప్రతి కీలక నిర్ణయం వెనుక పరాగ్ ఉన్నారు. ఆయనలో నిరంతరం నేర్చుకోవాలనే తపన, పరిశోధించే గుణం, హేతుబద్ధత, సృజనాత్మకత, స్వీయ అవగాహన, వినయం విధేతయత వంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన మనస్ఫూర్తిగా కంపెనీని ముందుకు నడిపిస్తారు. పరాగ్ నుంచి నేను రోజూ కొత్త విషయాన్ని నేర్చుకుంటాను. ఆయనపై నాకు చాలా నమ్మకం ఉంది.
- జాక్ డోర్సే, ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు
పరాగ్ నియామకంతో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల(Indian origin CEOs) సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్న వారు ఎవరు? ఆయా కంపెనీలు భారతీయులనే ఎంచుకోవడానకి కారణాలు ఏంటి?
భారతీయులు నాయకత్వం వహిస్తున్న దిగ్గజ కంపెనీలు ఇవే..
- అడోబ్- శంతను నారాయణన్
- ఆల్ఫాబెట్, గూగుల్- సుందర్ పిచాయ్
- మైక్రోసాఫ్ట్- సత్య నారాయణ నాదెళ్ల(సత్య నాదెళ్ల)
- డెలాయిట్ - పూనిత్ రంజన్
- నోవార్టిస్ - వసంత్ నరసింహన్ (వస్)
- డియా జియో - ఇవాన్ మాన్యూయల్
- వేఫెయిర్ - నీరజ్ ఎస్. షా
- మైక్రాన్ - సంజయ్ మెహ్రోత్రా
- నెట్ యాప్ - జార్జి కురియన్
- పాల్ ఆల్టో నెట్‌వర్క్ - నిఖేష్ అరోరా
- హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ - దినేష్ సి పాలివాల్
- ఐబీఎం - అరవింద్ కృష్ణా
- వుయ్‌వర్క్ - సందీప్ మత్రాని
కీలకమైన ఈ కంపెనీల్లో భారతీయులు సీఈఓల స్థాయికి చేరడానికి చాలా కారణాలు ఉన్నాయి. గ్లోబలైజేషన్‌కు అమెరికా సమాజం నిలువెత్తు రూపం. పలు దేశాల ప్రజలు.. జాతుల వారు అక్కడ స్థిరపడి దేశాభివృద్ధికి కృషి చేశారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా బహుళజాతి కంపెనీల్లో కనబడుతుంది.
గతంలో పెప్సీకి ఇంద్రా నూయి.. సిస్కోలో పద్మశ్రీవారియర్ కూడా కీలక స్థానాల్లో పనిచేశారు. కోకాకోలా వంటి కంపెనీలను ఎదుర్కోంటూ పెప్సీని ప్రపంచస్థాయికి చేర్చడంలో ఇంద్రా నూయి పాత్ర వెలకట్టలేనిది. కంపెనీ కష్టకాలంలో భారతీయులు బాగా పనిచేస్తారనే పేరు తీసుకురావడానికి ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. భారతీయులను సీఈవోలుగా ఎంచుకోవడానికి కారణాలను నిపుణులు విశ్లేషించారు..
సమాజంలో ఒడుదొడుకులు ఎదుర్కొని..
భారత్ 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం. ఇక్కడ డజన్ల కొద్ది భాషలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి విషయంలో విపరీతమైన పోటీని ఎదుర్కొని గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో వేగంగా మారే సామాజిక రాజకీయ పరిస్థితులు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. దీంతో ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. వాస్తవ పరిస్థితులను అంగీకరించే మనస్తత్వాన్ని ఏర్పర్చుకుంటారు. ఈ క్రమంలో భారీగా పోటీని ఎదుర్కొని గెలిచేందుకు సృజనాత్మకత, ఓపికగా ఎదురు చూసే తత్వం వారు అలవర్చుకుంటారు. దీంతో కార్పొరేట్ బ్యూరోక్రసీలో వీరు మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంది.
కత్తికి రెండువైపులా పదును పెడతారు..
భారతీయులకు ముందుచూపు చాలా వ్యూహాత్మకంగా ఉంటుందనే పేరుంది. భారతీయులు సమాచారం సేకరించడంలో మాస్టర్లు. వారు ఆ సమాచారాన్ని ఒక వ్యూహం ప్రకారం సిద్ధం చేస్తారు. అది పనిచేయకపోతే ఏమి చేయాలో కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొంటారు. సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వుయ్‌వర్క్ భవిష్యత్తు సీఈఓ మాత్రాని ఇలాంటి వ్యూహాలనే వివరించి ఆశ్చర్యపర్చాడు.
పక్కాగా లెక్కలేసి..