తెలంగాణ

telangana

ETV Bharat / business

జీరో బ్యాలెన్స్ అకౌంట్ అందించే బ్యాంకులు ఇవే.. - యాక్సిస్​ బ్యాంక్ ఫ్రీ అకౌంట్ వివరాలు

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అనివార్యం అయిపోయింది. అయితే.. ఎల్లప్పుడూ అకౌంట్​లో కనీస బ్యాలెన్స్ ఉండేలా చూడడం కొందరికి ఇబ్బందే. ఇలాంటి వారి కోసమే బ్యాంకులు కనీస నగదు నిల్వ అవసరం లేకుండా.. జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూడా అందిస్తున్నాయి. ఏఏ బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందిస్తున్నాయి? వాటితో లభించే అదనపు సదుపాయాలు ఏమిటి? అనేవి తెలుసుకుందాం.

How to Get Free Account
ఫ్రీ బ్యాంక్ అకౌంట్ పొందటం ఎలా

By

Published : Jul 22, 2021, 1:08 PM IST

కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా పొదుపు ఖాతా నిర్వహించుకోవాలనుకునే వారికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉత్తమమైన ఎంపిక.

మినిమం బ్యాలెన్స్ విషయంలో వినియోగదారుల్లో స్పష్టత తక్కువగా ఉంటుంది. బ్యాంకు ఖాతాలో ఎల్లప్పుడూ కొంత మొత్తం ఉండాలి అని అనుకుంటారు. 30 రోజుల పాటు రోజు ముగిసేటప్పుడు ఖాతాలో ఉండే మొత్తాన్ని కలిపి వాటి సరాసరి తీయగా వచ్చేదే నెలవారీ సరాసరి బ్యాలెన్స్.

చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందిస్తున్నాయి. వీటిని ఆయా బ్యాంకులు వివిధ పేర్లతో ఇస్తుంటాయి. వివిధ బ్యాంకులు అందిస్తోన్న ఖాతాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్​బీఐ బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్

  • బేసిక్ కేవైసీ డాక్యుమెంట్స్​తో ఖాతా తెరవొచ్చు
  • ఉచిత డెబిట్ కార్డు
  • ఇతర బ్యాంకు ఏటీఎంలలో నాలుగు ఉచిత విత్ డ్రాలు
    ఎస్​బీఐ

ఐసీఐసీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్

  • ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం
  • ఉచిత చెక్ బుక్
  • ఉచిత క్యాష్ డిపాజిట్
  • నిర్దిష్ట పరిమితి తర్వాత వేరే బ్యాంకు ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకుంటే ఛార్జీలు
    ఐసీఐసీఐ బ్యాంక్

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్

  • ఉచిత ఏటీఎం కార్డు (అంతర్జాతీయంగా వాడుకునే సదుపాయం)
  • ఫోన్ బ్యాంకింగ్
  • ఇతర బ్యాంకు ఏటీఎంలలో నాలుగా విత్ డ్రాలు ఉచితం
    హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్

యాక్సిస్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్

  • ఉచిత రూపే డెబిట్ కార్డు
  • 10 వేల వరకు క్యాష్ డిపాజిట్ లిమిట్
  • ఇతర బ్యాంకు ఏటీఎంలలో నాలుగు ఉచిత ట్రాన్సాక్షన్స్
    యాక్సిస్​ బ్యాంక్

ఇండస్ఇండ్ స్మాల్ సేవింగ్స్ అకౌంట్

  • ఉచిత డెబిట్ కార్డు
  • పాస్ బుక్​ ఉచితం
  • ఫ్రీ చెక్ బుక్
  • ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ట్రాన్సాక్షన్స్
    ఇండస్​ ఇండ్ బ్యాంక్

ఐడీఎఫ్​సీ ప్రథమ్ సేవింగ్స్ అకౌంట్

  • ఇంటర్నెట్ బ్యాంకింగ్
  • మొబైల్ బ్యాంకింగ్
  • ఉచిత చెక్ బుక్, పాస్ బుక్
  • ఉచిత డెబిట్ కార్డు
    ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్​

ఆర్​బీఎల్​ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్

  • గరిష్ఠంగా రూ.1 లక్ష డిపాజిట్
  • ఫిక్స్​డ్​ డిపాజిట్ సౌకర్యం
    ఆర్​బీఎల్​ బ్యాంక్

కోటక్ మహీంద్ర 811 అకౌంట్

  • ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు
  • స్కాన్ అండ్ పే ఆప్షన్
  • నెఫ్ట్, ఆర్​టీజీఎస్ సౌకర్యం
    కోటక్ మహీంద్రా బ్యాంక్​

స్టాండర్డ్ చార్టర్​ బేసిక్ బ్యాంకింగ్ అకౌంట్

  • ఉచిత ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు
  • లాకర్ సౌకర్యంపై డిస్కౌంట్
  • డోర్ స్టేప్ సౌకర్యాలు
    స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్

ఇవే కాకుండా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా కూడా జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరుచుకోవచ్చు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details