తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహన రంగానికి జీఎస్​టీ ఊరట లేనట్లే! - జీఎస్​టీ రేట్లు

వాహన రంగానికి పన్ను కోతలు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు ఆర్థిక శాఖ వర్గాలు సంకేతాలిచ్చాయి. జీఎస్‌టీ రేట్లు తగ్గించే యోచనేదీ లేదని వారు స్పష్టం చేశారు. పన్ను కోతలకు బదులుగా ఇతర వ్యయాలను తగ్గించుకోవాలని సూచించారు.

GST AUTO
వాహనాలు

By

Published : Sep 18, 2020, 7:09 AM IST

Updated : Sep 18, 2020, 7:15 AM IST

ప్రభుత్వాన్ని జీఎస్‌టీ తగ్గించమని అడగడం కంటే.. మాతృ సంస్థలకు రాయల్టీ చెల్లింపులు తగ్గించుకుంటే వ్యయాలు తగ్గుతాయని వాహన కంపెనీలకు ఆర్థిక మంత్రిత్వ వర్గాలు సూచిస్తున్నాయి. భారత్‌లో అధిక పన్నులు ఉన్నాయంటూ వచ్చిన విమర్శలపై పై విధంగా వారు స్పందించారు.

వాహన రంగానికి పన్ను కోతలు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్లు ఆ శాఖలోని సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్లు తగ్గించే యోచనేదీ లేదని వారు స్పష్టం చేశారు. జీఎస్‌టీకి ముందున్న వ్యాట్‌, ఎక్సైజ్‌ సుంకాల కంటే కూడా ఇప్పుడు తక్కువగానే వాహనాలపై జీఎస్‌టీ రేట్లు ఉన్నాయని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

జీఎస్‌టీతో సమస్య లేదు..

గత మూడు దశాబ్దాలుగా వాహన రంగంపై పన్ను విధానాలు స్థిరంగా ఉన్నాయని.. విదేశీ పెట్టుబడులను అనుమతించామని.. దేశీయ తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని ఆ వర్గాలు వివరించాయి. దేశంలోని వాహన పరిశ్రమలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడంపై ప్రశంసిస్తూనే.. అధిక జీఎస్‌టీ రేట్ల వల్ల సమస్య ఉందన్న అంశాన్ని ఖండిస్తున్నామని ఆర్థిక శాఖలోని వర్గాలు ఈటీవీ భారత్‌తో వివరించాయి. రాయల్టీ చెల్లింపుల్లో కోత ద్వారా తమ తయారీ వ్యయాలను తగ్గించుకోవాలని వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ కూడా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే.

అంతర్జాతీయంగానూ అధికమే..

అంతర్జాతీయంగా కూడా అవే పన్ను రేట్లు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

"జపాన్‌లో వాహనాలపై మూడు రకాల పన్ను రేట్లున్నాయి. వాటిపైన అదనంగా జీఎస్‌టీ ఉంది. ఈయూలోనూ 20-25 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. బ్రిటన్‌లో 14 రకాల రేట్ల శ్లాబులున్నాయి. భారత్‌లో ప్యాసింజరు వాహనాలపై పరిహార సెస్సు 1 నుంచి 22 శాతం మేర ఉంది. ఆ సెస్సులను కలిపిన తర్వాతా జీఎస్‌టీ కంటే ముందు స్థాయి పన్ను కంటే దిగువే ఉంది. పన్ను మినహాయింపులు పొందుతున్న కొన్ని విభాగాలకే అధిక పన్నులున్నాయి" అని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి:'భారత్​లో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతాం'

Last Updated : Sep 18, 2020, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details