తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న రియల్ ఎస్టేట్ రంగం' - telangana news

ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం ప్రభాకర్ రావు అన్నారు. మహతీ మార్కెట్‌ ఎసెన్షియల్‌ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు నిర్వహించనున్న హైబ్రిడ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌ ఫో రియాల్టీ కనెక్స్‌ బ్రోచర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న రియల్ ఎస్టేట్ రంగం
ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న రియల్ ఎస్టేట్ రంగం

By

Published : Jan 12, 2021, 10:36 PM IST

కొవిడ్‌ కారణంగా కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం ప్రభాకర్ రావు అన్నారు. ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు.

మహతీ మార్కెట్‌ ఎసెన్షియల్‌ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు నిర్వహించనున్న హైబ్రిడ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌ ఫో రియాల్టీ కనెక్స్‌ బ్రోచర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌రావుతో పాటు, వ్యాపారవేత్త చందు, నిర్వహకులు అవినాశ్​ తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్లుగా నగరంలో రియాల్టీ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని... ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం అందించే రంగాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒకటని మహతీ మార్కెట్‌ ఎసెన్షియల్‌ సంస్థ ఎండీ అవినాశ్​ అన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా ఆసక్తి కలిగిన వ్యక్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

కొవిడ్‌ కారణంగా సాంకేతిక వినియోగం పెరిగిందని... వర్చువల్‌ ప్రదర్శనలకు ఆదరణ పెరుగుతోందన్నారు. హైదరాబాద్‌ నోవాటెల్‌లోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దాదాపు 150 రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు.

ఇవీచూడండి:కిడ్నాప్​ ప్లాన్​ ఎవరిది.. అప్పుడు అఖిలప్రియ ఎక్కడున్నారు?

ABOUT THE AUTHOR

...view details