తెలంగాణ

telangana

ETV Bharat / business

'పన్ను చెల్లింపులో పాత విధానమే లాభదాయకం' - business news

సరళీకరణ, మినహాయింపుల తొలగింపు లక్ష్యాలతో నూతన ఆదాయపన్ను విధానాన్ని బడ్జెట్​లో ప్రవేశపెట్టింది కేంద్రం. ఆదాయ పన్ను చెల్లింపునకు ఇకపై రెండు విధానాలను ఈ బడ్జెట్​లో కేంద్రం తీసుకొచ్చింది. అయితే కొత్త పన్ను శ్లాబుల ద్వారా సామాన్యునికి ఆర్థిక భారమే కానీ లాభదాయకం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

The old method of taxation is profitable
పన్ను చెల్లింపులో పాత విధానమే లాభదాయకం

By

Published : Feb 1, 2020, 10:40 PM IST

Updated : Feb 28, 2020, 8:15 PM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన పన్ను శ్లాబుల విధానం సామాన్యునికి ఆర్థికంగా భారమే కానీ.. లాభదాయకం ఏమాత్రం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పన్ను శ్లాబులు పైకి లాభదాయకంగా కనబడుతున్నా.. లెక్కలు వేస్తే మాత్రం పెద్దగా ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు తుమ్మ బాలరాజు చెబుతున్నారు. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలన్నా నిర్ణయం పూర్తిగా పన్ను చెల్లింపుదారుడిదే అయినప్పటికీ.. పాత పద్ధతిలోనే కొనసాగడం లాభదాయకమని సూచిస్తున్నారు.

నూతన పన్ను విధానంపై నిపుణుల అభిప్రాయం

శనివారం పార్లమెంటులో 2020 బడ్జెట్​ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ఈ ఇకపై పన్ను చెల్లింపునకు రెండు విధానాలను ప్రతిపాదించారు. పాత విధానమా? కొత్త విధానమా? అనే దానిని పన్ను చెల్లింపుదారులే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.

అయితే ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. కొత్త విధానంలోకి మారితే ఎలాంటి మినహాయింపులు ఉండవు. పాత పద్దతిలో అయితే మినహాయింపులు కొనసాగుతాయి.

Last Updated : Feb 28, 2020, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details