దేశంలో జియో రాకతో ప్రజల్లో డేటా విప్లవం మొదలైందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. భారత్ డిజిటల్ సమాజంగా మారేందుకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే సత్తా భారత్‌కు ఉందన్నారు.
ముంబయిలో మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఫ్యూచర్ డీకోడెడ్ సీఈఓ సదస్సులో పాల్గొన్నారు అంబానీ. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో చర్చాగోష్టిలో పాల్గొన్నారు.
"2014లో ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫలితంగా జియో అందించిన 4జీ సాంకేతికతను 38 కోట్ల మంది అందిపుచ్చుకున్నారు. జియోకు ముందు డేటా వేగం 256 కేబీపీఎస్‌గా ఉండేది. ప్రస్తుతం 21 ఎంబీపీఎస్‌కు చేరింది."