2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) సమర్పించేందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి.. సెప్టెంబర్ 30గా ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదార్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31 వరకు ఉండగా, ఇప్పుడు సెప్టెంబర్ 30కి పొడిగించినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సర రిటర్నులు (అసలు, సవరించిన) సమర్పించేందుకు ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది మూడోసారి.
ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబర్ 30 వరకు గడువు - CBDT
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ... ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించే గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబర్ 30 వరకు గడువు
2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్ 30కి పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఈ గడువును జులై 31కి పొడిగించారు. ఇప్పుడు సెప్టెంబర్ 30కి పొడిగించారు.
ఇదీ చూడండి:'ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు'