రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం తగ్గినా, పరిహారం చెలించాల్సిన 'చట్టబద్ధబాధ్యత' కేంద్రానికి లేదని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ అభిప్రాయం పడినట్లు సమాచారం. అందువల్ల ఇకపై పన్ను ఆదాయం తగ్గితే, రాష్ట్రాలు అదనంగా రుణాలు చేసుకోవాల్సి రావచ్చు. జీఎస్‌టీ ప్రవేశ పెట్టిన క్రమంలో, ఆదాయం తగ్గితే రాష్ట్రాలకు అయిదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి విదితమే. పరిహార నిధికి రాబడి తగ్గడంతో సమస్య ఏర్పడింది. కొవిడ్ సంక్షోభం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో పరిహార నిధి కోసం మార్కెట్ నుంచి రుణాలు సమీకరించేందుకు ఉన్న చట్టబద్ధతపై అభిప్రాయం తెలపాలని గత మార్చిలో ఏజీ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత కేంద్రానికి లేదని ఏజీ తెలిపినట్లు సమాచారం.
ఇవీ జీఎస్‌టీ మండలి ముందున్న మార్గాలు
- జీఎస్‌టీ రేట్లను హేతుబద్దీకరించడం
- మరిన్ని ఉత్పత్తులపై పరిహార సెస్ విధిచడం లేదా ఇప్పటికే వసూలు చేస్తున్న సెస్‌ను పెంచడం
- రాష్ట్రాలు మరిన్ని రుణాలు సమీకరించుకోవడం. వీటిని పరిహార నిధికి వచ్చే మొత్తం ద్వారా తీర్చడం.