అమూల్ బేబీ... దేశీయ పాల ఉత్పత్తుల దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమూల్ సంస్థ లోగో. పిలక జుట్టు, చుక్కుల చుక్కల గౌనుతో ఆకర్షణీయమైన ప్రకటనలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. బ్రాండ్‌గా మారిన అమూల్ బేబీ లోగోకు ఎప్పుడు రూప కల్పన జరిగింది అనేది చాలా మందికి తెలియదు.
'అమూల్ బేబీ' ఎలా పుట్టిందో తెలుసా? - amul's rival brand polson's butter girl
పాల ఉత్పత్తుల దిగ్గజం 'అమూల్' పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది 'బేబీ' లోగో. సంస్థ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన 'అమూల్ బేబీ' ఎలా పుట్టింది? లోగో రూపకల్పన ఎప్పుడు జరిగింది?
!['అమూల్ బేబీ' ఎలా పుట్టిందో తెలుసా? The amul girl was created as a responce to polson's butter girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8833030-660-8833030-1600329636917.jpg)
'అమూల్ బేబీ' ఎలా పుట్టిందో మీకు తేలుసా?
వెన్న ఉత్పత్తి దిగ్గజం పోల్సన్ లోగోకు పోటీగా అమూల్ సంస్థ.. పొట్టిగా, ముద్దుగా, పిలక వేసుకొని, చుక్కల గౌనుతో బేబీ లోగోను 1967లో విడుదల చేసింది. అది దాదాపు 53 సంవత్సరాలుగా నవ్వు తెప్పించే ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది అమూల్ బేబీ. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పురాతన లోగోల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ఎలాంటి సందేశాన్ని అయినా ఆ చిన్నారి లోగోతోనే సంస్థ ఇస్తూ వస్తోంది.
గురువారం మోదీ పుట్టిన రోజు సందర్భంగా కూడా ప్రధానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది అమూల్ బేబీ.
TAGGED:
amul girl latest news