Tesla recall Cars: విద్యుత్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా 54 వేల కార్లు, ఎస్‌యూవీలను రీకాల్ చేసింది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినా.. ఆగకుండా ముందుకు వెళ్లిపోతుందని అమెరికా రక్షణ నియంత్రణ సంస్థ పేర్కొంది. ఇది భద్రతా పరమైన సమస్యగా మారిందని అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో రెండుసార్లు సమావేశమైన తర్వాత టెస్లా రీకాల్‌కు అంగీకరించింది. అయితే ఆ ఫీచర్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదని టెస్లా చెబుతోంది. టెస్లా రీకాల్ చేసిన కార్లలో మోడల్ ఎస్ సెడాన్లు, ఎక్స్ ఎస్యూవీ, మోడల్ 3 సెడాన్లను, మోడల్ వై ఎస్‌యూవీలు ఉన్నాయి.