ఎలన్ మస్క్‌లోని వ్యాపారి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటాడు. ప్రతి రూపాయి లెక్క అన్నట్లు వ్యవహరిస్తాడు. అందుకే భారత్‌లో తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ఎటునుంచి వస్తే లాభమో లెక్కలేసుకొని.. నెదర్లాండ్స్‌ను ఎంచుకొన్నాడు. ఇటీవల భారత్‌లో మస్క్ రిజిస్టర్ చేసిన టెస్లా మోటార్స్ అండ్ ఎనర్జీ ఇండియాకు నెదర్లాండ్స్‌లోని టెస్లా మోటార్స్ నెదర్లాండ్స్ మాతృసంస్థగా వ్యవహరించనుంది. ఈ నిర్ణయంతో మస్క్‌కు భారత్‌లో మూలధనంపై వచ్చే లాభాలు, డివిడెండ్ చెల్లింపుల్లో భారీగా పన్ను రాయితీలు లభించనున్నాయి.
టెస్లా నిర్ణయం విభిన్నమైందనే చెప్పాలి. గతంలో భారత్‌కు వచ్చిన విదేశీ కంపెనీలు తమ యాజమాన్యాలు ఉన్న చోటు నుంచే భారత్‌లోకి ప్రవేశించాయి. 2017లో భారత్‌లో పెట్టుబడి పెట్టిన ఎంజీ మోటార్స్ చైనా నుంచి వచ్చింది. ఈ సంస్థ వాస్తవంగా బ్రిటన్‌కు చెందినదైనా.. దీనిని చైనా సంస్థ ఎస్‌ఏఐసీ మోటార్స్ కొనుగోలు చేసింది. అలానే కియా మోటార్స్ పెట్టుబడులు నేరుగా దక్షిణ కొరియా నుంచి వచ్చాయి. ఆ దేశంలోనే కియా కార్పొరేట్ కార్యాలయం కూడా ఉంది.
నెదర్లాండ్స్ ఎందుకు..?
టెస్లా మోటార్స్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో రిజిస్టరైంది. టెస్లామోటార్స్ నెదర్లాండ్స్ దీని అనుబంధ సంస్థ. కానీ, అమెరికా సంస్థలు నెదర్లాండ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతాయి. ఆ కంపెనీలకు పన్ను రాయితీలు ఎక్కువగా ఇవ్వడం, మేధోహక్కుల సంరక్షణకు కఠిన చట్టాలు ఉండటమే కారణం.
సింగపూర్, మారిషస్‌తో ఉన్న పన్ను ఒప్పందాలను భారత్ సవరించింది. గతంలో ఈ రెండు దేశాల నుంచి భారత్‌కు ఒకప్పుడు భారీగా ఎఫ్‌డీఐలు వచ్చేవి. కానీ, సవరణ తర్వాత ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపై మూలధన పన్నురాయితీలు తగ్గిపోయాయి. దీంతో పన్ను రాయితీలు పొందాలంటే మిగిలిన అత్యున్నత మార్గాల్లో నెదర్లాండ్స్ కూడా ఒకటి. ఈ దేశంతో ఉన్న ఒప్పందం ప్రకారం ఆయా డచ్ కంపెనీలు భారతీయ విభాగాలను విదేశీ కంపెనీలకు విక్రయించినా మూలధన పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాదు.. డివిడెండ్ ట్యాక్స్, విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌లు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
జనవరి 8న బెంగళూరులో రిజిస్ట్రేషన్..