నిన్నమొన్నటి వరకు విద్యుత్తు కార్లు ఇప్పుడే ఎక్కడ సాధ్యం.. అనుకునే పరిస్థితి. కానీ ఈ రంగంలో వస్తున్న మార్పులు, పెట్రో ధరలు చుక్కలనంటుతుండటంతో ప్రత్యామ్నాయాలకు వినియోగదార్ల ఆదరణ, సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటే విద్యుత్తు కార్ల విప్లవం వేగవంతం అవుతోందని స్పష్టమవుతోంది. అమెరికా కేంద్రంగా విద్యుత్తు కార్ల విభాగంలో సంచలనాలు సృష్టిస్తున్న టెస్లా, సమీప భవిష్యత్తులో అమెరికా వెలుపల ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ తాజాగా ఒక నివేదికలో(morgan stanley latest report) స్పష్టం చేసింది. దీని ప్రకారం వాహన ఉత్పత్తిలో పెను సంచనాలకు టెస్లా శ్రీకారం చుట్టబోతోంది. ప్రస్తుతం అమెరికాలోని ఫ్రెమాంట్‌లో టెస్లా కార్ల ఉత్పత్తి ప్రధానంగా సాగుతోంది. యూఎస్ వెలుపల జర్మనీ, కెనడా, చైనా దేశాల్లోనూ ఉత్పత్తి కార్యకలాపాలు ఉన్నాయి. ఈ దేశాలకే పరిమితం కాకుండా ఉత్పత్తి సదుపాయాలను ఇంకా విస్తరించే అవకాశాలు ఉన్నాయని, ప్రధానంగా 2025 నాటికి భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి(tesla cars in india) యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది. దీంతో పాటు తూర్పు ఐరోపా, ఆగ్నేయ ఆసియాల్లోనూ ప్లాంట్లు ఏర్పాటు కావచ్చని వివరించింది.
2025 నాటికి భారత్‌లో 'టెస్లా' కార్ల ఉత్పత్తి! - భారత్‌లో టెస్లా కార్ల ఉత్పిత్తి యూనిట్
2025 నాటికి భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి(tesla cars in india) యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ తాజాగా ఒక నివేదికలో స్పష్టం చేసింది. పెట్రో ధరల పెరుగుదల నేపథ్యంలో ఈవీలకు విపరీతంగా ఆదరణ పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
మనదేశంలో విద్యుత్తు కార్లను ఆవిష్కరించడం ఇటీవలి పరిణామమే. హ్యుందాయ్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎంజీ ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చాయి. కానీ అధిక ధర, ఛార్జింగ్ సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఇతర పరిమితుల వల్ల ఇంకా విద్యుత్తు కార్ల వాడకం బాగా పెరగలేదు. అందుకే మారుతీ సుజుకీ 2025 వరకు వేచి చూస్తామని పేర్కొంటోంది. కానీ పరిస్థితులు త్వరగానే మారతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విద్యుత్తు కార్ల సాంకేతిక పరిజ్ఞానం స్థిరీకరణతో పాటు ధరలు దిగివచ్చే కొద్దీ వినియోగదార్లు ఈ కార్లను ఇష్టపడతారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. వచ్చే నాలుగైదేళ్లలోనే ఎంతో మార్పు వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. యూఎస్ దిగ్గజ సంస్థ అయిన టెస్లా సైతం మనదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఆసక్తికర విషయం.
ఇదీ చూడండి:వేధిస్తున్న చిప్‌ల కొరత- క్షీణించిన వాహన విక్రయాలు