తెలంగాణ

telangana

ETV Bharat / business

చెప్పినట్టే భారత్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాం: టెస్లా

భారత మార్కెట్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్.

tesla CEO
చెప్పినట్లుగానే భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నాం: టెస్లా

By

Published : Jan 14, 2021, 8:31 PM IST

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' భారత మార్కెట్‌లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్ ధ్రువీకరించారు. గతవారం టెస్లా సంస్థ బెంగళూరులోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ వద్ద పేరు నమోదు చేయించుకుంది.

టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రిజస్ట్రేషన్ చేయించుకున్న టెస్లా సంస్థ... వైభవ్‌ తనేజా, వెంకటరంగమ్‌ శ్రీరామ్, డేవిడ్‌ జోన్‌ ఫీన్‌స్టెయిన్‌లను డైరెక్టర్లుగా నియమించింది. భారత్‌లో పరిశోధనా, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ఐదు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. అతి ఖరీదైన టెస్లా కార్లకు భారత్‌ ఎలా మార్కెట్‌గా మారుతుందని విశ్లేషిస్తూ రాసిన ఒక బ్లాగు లింకుకు సమాధానం ఇచ్చిన ఎలాన్ మస్క్‌ 'వాగ్దానం చేసినట్లుగానే' అని ట్వీట్ చేశారు.

2021లో టెస్లా భారత్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా తయారీ యూనిట్‌ను పెట్టే అవకాశాలను టెస్లా పరిశీలిస్తుందని అన్నారు. మొదట టాటా మోటార్స్‌తో కలిసి పనిచేయాలని భావించిన టెస్లా తర్వాత ఆ ప్రణాళికను విరమించుకుంది.

ఇదీ చదవండి:'వాట్సాప్​కు బై- టెలిగ్రామ్, సిగ్నల్​కు జై!'

ABOUT THE AUTHOR

...view details