గత కొన్ని సంవత్సరాలుగా టర్మ్ పాలసీల గురించి చాలా మందికి అవగాహన పెరిగింది. తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజీ ఉండటం వల్ల.. వీటిని తీసుకునే వారి సంఖ్యలో వృద్ధి చాలా కనబడింది. ఇప్పుడు ఇవి చాలా పాపులర్ పాలసీలుగా ఉన్నాయి.
కొవిడ్ వల్ల ఆరోగ్యంతో పాటు బీమాకు సంబంధించిన అవగాహన ఎక్కువైంది. కొవిడ్ వల్ల క్లెయిమ్లు కూడా పెరిగినట్లు బీమా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే.. టర్మ్ పాలసీల ప్రీమియం పెరిగే అవకాశాలు ఉన్నట్లు బీమా రంగంలో పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా బీమా కంపెనీలు.. రిస్కును తగ్గించుకునేందుకు తిరిగి బీమా చేయించుకుంటాయి. ఇందుకోసం రీ-ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడుతుంటాయి. కరోనా వల్ల మరణాల సంఖ్య పెరిగింది. దీనివల్ల అవి ప్రీమియం పెంచాయని, ఫలితంగా బీమా కంపెనీలు కూడా ప్రీమియం పెంచే అవకాశం ఉందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్తగా తలెత్తుతున్న రిస్కులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రీమియం పెంపును నిర్ణయించనున్నట్లు అంచనా వేస్తున్నారు.
గ్లోబల్ మహమ్మారి కావటమే కారణం..