కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికపై కేంద్రం మండిపడింది. జీఎస్టీ నిధులను తాత్కాలికంగానే అట్టిపెట్టుకున్నామని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. దాని అర్థం దారి మళ్లింపు కాదని వివరణ ఇచ్చింది. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రాలకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించినట్లు స్పష్టం చేసింది.
2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు నష్టపరిహారంగా చెల్లించాల్సిన రూ. 47 వేల 272 కోట్ల జీఎస్టీ మొత్తాన్ని.. కేంద్రం తప్పుగా అట్టిపెట్టుకుందని కాగ్ శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కాగ్ నివేదికను కేంద్రం తప్పుబట్టింది.
ఇదీ చూడండి: జీఎస్టీ చట్టం ఉల్లంఘించిన కేంద్రం: కాగ్