Mars pet care expansion: దేశంలో ప్రముఖ పెట్ ఫుడ్ కంపెనీ మార్స్ పెట్ కేర్.. రాష్ట్రంలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 2008 నుంచి హైదరాబాద్‌లో ఈ కంపెనీ పెంపుడు జంతువుల ఆహారాన్ని తయారుచేస్తోంది. ఈ మేరకు మార్స్ పెట్ కేర్ ప్రతినిధులు.. ప్రగతిభవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఉన్న తమ కంపెనీని రూ. 500 కోట్ల పెట్టుబడితో మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
200 మందికి ఉపాధి
కంపెనీ విస్తరణ ద్వారా దేశంలో పెరుగుతున్న పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తితో పాటు, ఆసియా వ్యాప్తంగా పెట్ ఫుడ్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు కంపెనీ విస్తరణ ద్వారా 200 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గణేశ్ రమణి పేర్కొన్నారు. మార్స్ పెట్ కేర్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రకటనను స్వాగతిస్తూ.. మెగా ప్రాజెక్టు కేటగిరీ కింద మెరుగైన రాయితీలు అందజేస్తామని కంపెనీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:Gramee Naturals Telangana : గ్రామీ నేచురల్స్.. ఈ గానుగ నూనెలు ఆరోగ్యానికి శ్రేయస్కరం