భారత్లో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక అడుగు పడింది. 5జీ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఎమ్టీఎన్ఎల్కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ సంస్థలు ఏవీ చైనాకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
ఈ ట్రయల్స్ కోసం ఎరిక్సన్, నోకియా, సామ్సంగ్, రిలయన్స్ జియో అభివృద్ధి చేసిన సాంకేతికతలు మాత్రమే ప్రభుత్వం కేంద్రం ఆమోదించిన 5జీ గేర్ తయారీదారుల జాబితాలో ఉన్నాయి.
"5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ట్రయల్స్ నిర్వహించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం అనుమతి ఇచ్చింది. ఇందుకు దరఖాస్తు చేసిన వాటిలో భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, వొడాఫోన్-ఐడియా లిమిటెడ్, ఎంటీఎన్ఎల్ ఉన్నాయి."