అంతర్జాతీయ విపణితో సమానంగా ముందుకు వెళ్లేందుకు 6జీ(6G In India) ఇతర భవిష్యతరం సాంకేతికతలపై పరిశోధన చేయాలని చేయాలని ప్రభుత్వరంగ టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ (సి-డాట్)ను టెలికాం కార్యదర్శి కె.రాజారామన్ కోరారు. 4జీతో పోలిస్తే 5జీ 10 రెట్లు వేగవంతమైంది కాగా, 5జీ కంటే సుమారు 50 రెట్లు వేగంగా 6జీ(6G In India) పని చేస్తుందని, 2028-30 నాటికి ఈ సేవలను వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రయత్నాలని ఆయన వెల్లడించారు.
'5జీ కంటే 50రెట్ల వేగంతో 6జీ సేవలు' - దేశంలో టెలికాం సేవలు
4జీతో పోలిస్తే 5జీ 10 రెట్లు వేగవంతమైంది కాగా, 5జీ కంటే సుమారు 50 రెట్లు వేగంగా 6జీ పని చేస్తుందని టెలికాం కార్యదర్శి కె.రాజారామన్ పేర్కొన్నారు. 6జీ(6G In India) ఇతర భవిష్యత్ తరం సాంకేతికతలపై పరిశోధన చేయాలని ప్రభుత్వరంగ టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ(సి-డాట్)ను ఆయన కోరారు.
సిద్ధాంతపరంగా చూస్తే.. 5జీలో గరిష్ఠ డౌన్‌లోడ్ వేగం సెకనుకు 20 జీబీ కాగా, ఇటీవల వొడాఫోన్ ఐడియా దేశంలో నిర్వహించిన పరీక్షల్లో గరిష్ఠంగా 3.7 జీబీపీస్ వేగాన్ని అందుకున్నట్లు వెల్లడించింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో నెట్‌వర్క్ దేశంలో 4జీలో గరిష్ఠంగా సెకనుకు 20 మెగాబైట్ డౌన్‌లోడ్ వేగం సాధించింది. దేశీయంగా 5జీ వాణిజ్య సేవలు ప్రారంభించే ప్రక్రియను టెలికాం విభాగం (డాట్) ప్రారంభించింది. సి-డాట్‌లో క్వాంటమ్ కమ్యూనికేషన్ ల్యాబ్‌ను రాజారామన్ ప్రారంభించారు.
ఇవీ చూడండి: