ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేయాలంటే శుక్రవారం( జనవరి 15) నుంచి ఫోన్ నంబర్ ముందు సున్నాను తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు తమ ఖాతాదారులకు అన్ని టెలికాం సంస్థలు సమాచారమిచ్చాయి. టెలికాం శాఖ ఆదేశాల మేరకు.. ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆయా సంస్థలు.
ఇక ల్యాండ్‌లైన్ నుంచి కాల్ చేస్తే '0' తప్పనిసరి
ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు ఫోన్ చేసినప్పుడు సున్నా (0) చేర్చాలనే ప్రతిపాదన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. టెలికాం శాఖ ఆదేశాల మేరకు తమ ఖాతాదారులకు ఆయా సంస్థలు ఈ మేరకు సమాచారమిచ్చాయి.
టెలికాం శాఖ
2021జనవరి 15 నుంచి ల్యాండ్‌లైన్‌ల నుంచి మొబైల్‌కు ఫోన్ చేయాలంటే మొబైల్ సంఖ్యకు మందు సున్నా చేర్చాలని గతేడాది నవంబర్‌లోనే టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఫోన్ నంబర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఫలితంగా దాదాపు 2,539 మిలియన్ల నంబర్ సిరీస్‌లు అందుబాటులోకి వస్తాయని అంచనా.
ఇదీ చూడండి:సీఈఎస్-2021లో ప్రత్యేక ఆకర్షణ ఈ ల్యాపీలే