తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏప్రిల్​లో 82 లక్షల చందాదారులను కోల్పోయిన టెల్కోలు - బీఎస్​ఎన్​ఎల్​

కరోనా సంక్షోభం, లాక్​డౌన్ ధాటికి 2020 ఏప్రిల్​లో దేశీయ టెలికాం సంస్థలు 82 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయని ట్రాయ్ తెలిపింది. ఎయిర్​టెల్​ 52 లక్షలు, వొడాఫోన్​-ఐడియా 45 లక్షల మంది వినియోగదారులను కోల్పోగా... జియో మాత్రం 16 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకోగలిగిందని ట్రాయ్ డేటా స్పష్టం చేస్తోంది.

Telcos lost 8.2 million mobile subscribers in April: TRAI
ఏప్రిల్​లో 82 లక్షల వినియోగదారులను కోల్పోయిన టెల్కోలు

By

Published : Jul 25, 2020, 8:09 PM IST

2020 ఏప్రిల్​లో టెలికాం సంస్థలు 82 లక్షల మంది వినియోగాదారులను కోల్పోయాయని టెలికారం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్​ తెలిపింది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్ విధించడమే ఇందుకు కారణమని ట్రాయ్ విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది.

ట్రాయ్ డేటా ప్రకారం

కరోనా ధాటికి ఎయిర్​టెల్, వొడాఫోన్-ఐడియాలు భారీగా నష్టపోయాయని ట్రాయ్ డేటా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఎయిర్​టెల్ 52 లక్షల మంది, వొడాఫోన్​-ఐడియా 45 లక్షల వినియోగదారులను కోల్పోయినట్లు పేర్కొంది.

జయహో.. జియో

ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మాత్రం ఇదే సమయంలో 16 లక్షల మంది కొత్త సబ్​స్క్రైబర్స్​ను చేర్చుకోగలిగింది. అయితే అంతకు ముందు నెలలో పోల్చుకుంటే.. జియో వినియోగదారుల పెరుగుదల ఏప్రిల్​లో తక్కువగా ఉంది.

అగ్రస్థానంలో జియో..

మొత్తం దేశీయ టెలికారం రంగంలో జియో 33.85 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఎయిర్​టెల్ 28.06 శాతం, వొడాఫోన్​-ఐడియా 27.37 శాతం, బీఎస్​ఎన్​ఎల్​ 10.43 శాతం, ఎంటీఎన్​ఎల్​ 0.29 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:వెండి ధరలో భారీ పెరుగుదల.. కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details