మీరు మొబైల్‌లో యూట్యూబ్ ఎక్కువగా చూస్తుంటారా? అయితే మీకు ఈ టిప్ తెలుసా? .. యూట్యూబ్ వీడియోలను నిలువుగా చూడటం కంటే, అడ్డంగా ఫుల్ స్క్రీన్‌లో చూడటంలోనే మజా ఉంటుందనే విషయం మీకు తెలిసిందే. దీని కోసం వీడియో కుడివైపు దిగువన ఉండే చతురస్రాకార ఐకాన్‌ను క్లిక్ చేస్తుంటారు. అయితే ఆ బటన్ చిన్నగా ఉండటం వల్ల, ఒక్కోసారి వీడియో టైమ్ లైన్ మీద వేలు టచ్ అయ్యి, వీడియో ఆఖరికి వచ్చేస్తుంటుంది. దీంతో మళ్లీ ఎక్కడివరకు చూశామో గుర్తుంచుకొని వెనక్కి వెళ్లాలి. గతంలో మీకూ ఇలానే జరిగిందా? అయితే ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది.
యూట్యూబ్‌లో వీడియోను ప్లే చేశాక.. ఆ వీడియో మీద వేలు ఆనించి పైకి స్వైప్ చేయాలి. అప్పుడు వీడియో ల్యాండ్‌స్కేప్ మోడ్ (అడ్డంగా)లోకి మారిపోతుంది. కావాలంటే ఈ వార్తను మినిమైజ్ చేసి ఒకసారి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి ఈ టిప్ ట్రై చేయండి. ఈ టిప్‌తో యూట్యూబ్‌లో స్క్వేర్ ఐకాన్‌ను క్లిక్ చేయకుండా పోర్‌ట్రైట్ మోడ్ (నిలువు) నుంచి ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోకి సులభంగా వెళ్లిపోవచ్చు.