2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్‌కు లాభాల పంట పండింది. సంస్థ నికర లాభం 14.9 శాతం పెరిగి రూ.9,246 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ఆ సంస్థ నికర లాభం రూ.8,049 కోట్లుగా ఉంది.
క్యూ4లో కేవలం టీసీఎస్ ఆదాయం 9.4 శాతం పెరిగి రూ. 43,705 కోట్లకు చేరింది.
"దశాబ్ద కాలంగా మంచి అవకాశం ఉండే రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాం. కొత్త సామర్థ్యాలను సృష్టించుకున్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగైన లాభాలు ఆర్జిస్తాం. ఈ లాభాలతో విపణిలో మరిన్ని అవకాశాలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాం."