కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రజల నుంచి తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇంతలా ఇంధన ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెరుగుదల ద్వారా ప్రధానంగా ఎవరు లాభపడుతున్నారు? ప్రజల అసహానికి కారణాలేంటి?
పెట్రోల్, డీజిల్‌పై ప్రజల ఆగ్రహానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
- అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 40 డాలర్లకు పడిపోయింది. అయితే ఇందుకు భిన్నంగా భారత్‌లో భారీగా పెరుగుదల నమోదైంది.
- కరోనా లాక్డౌన్ ప్రభావంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అత్యవసరమైన పెట్రోల్, డీజిల్ ధరల పెంపును అసాధారణంగా చూస్తున్నారు.
65 శాతం పన్నులే..
దేశ రాజధాని దిల్లీలో చూసినట్లయితే పెట్రోల్, డీజిల్ వాస్తవ రిటైల్ ధరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే మూడింట రెండొంతులు ఉంది. కేంద్రం 42 శాతం పన్నులు విధించగా, రాష్ట్రం 23 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. అంటే దిల్లీ వాసులు పెట్రోల్, డీజిల్‌పై 65 శాతం పన్నుగా కడుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు విధించి పన్నును అనుసరించి కొద్దిమేర వ్యత్యాసం ఉంటుంది.
19 రోజులుగా..
కరోనా నేపథ్యంలో 80 రోజుల పాటు రోజువారీ ధరల పెంపును నిలిపేశాయి ఆయిల్ కంపెనీలు. తిరిగి జూన్ 7న రోజువారీ సవరణను ప్రారంభించాయి. అప్పటి నుంచి వరుసగా 19 రోజులు ఇంధన ధరలను పెంచాయి. ఇలా దిల్లీలో పెట్రోల్‌పై రూ. 8.7, డీజిల్‌పై రూ.10.63 పెరిగింది. దిల్లీలో పెట్రోల్ ధరను డీజిల్ అధిగమించటం ఇదే తొలిసారి.
కంపెనీలదే నిర్ణయం..