తెలంగాణ

telangana

ETV Bharat / business

'చమురుపై పన్ను తగ్గింపు బాధ్యత ఒక్క కేంద్రానిదే కాదు' - finance minister nirmala sitaraman

చమురు ధరల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పన్ను కోతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలన్నారు. చమురును జీఎస్​టీ పరిధిలోకి తేవడంపై ఆ కౌన్సిలే నిర్ణయం తీసుకోవాలన్నారు.

nirmala, tax
నిర్మలా సీతారామన్

By

Published : Mar 5, 2021, 6:11 PM IST

ఇంధన ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రో ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్న విషయం వాస్తవేమేనని అన్నారు. అయితే పెట్రోల్​, డీజిల్​ పన్ను తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. కేవలం కేంద్రమే పన్నులో కోత విధించడం సరికాదన్నారు. ఇండియన్​ ఉమెన్​ ప్రెస్​ కార్ప్స్​ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా విలేకరులతో శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

"చమురుపై కేంద్రం మాత్రమే పన్ను విధించడం లేదు. రాష్ట్రాలు కూడా వ్యాట్​ రూపంలో వసూలు చేస్తున్నాయి. పన్ను తగ్గింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం వసూలు చేసే పన్నులో 41 శాతం రాష్ట్రాలకే చేరుతుంది. చమురును జీఎస్​టీ పరిధిలోకి తీసుకురావడం అనే విషయంపై జీఎస్​టీ కౌన్సిలే నిర్ణయం తీసుకోవాలి. జీఎస్​టీ పరిధిలోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించే విషయంపై రానున్న సమావేశాల్లోపు నిర్ణయం తీసుకుంటాం."

- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

గతేడాది మార్చి నుంచి మే మధ్య పెట్రోల్​, డీజిల్​లపై ఎక్సైజ్​ డ్యూటీని కేంద్రం భారీగా పెంచింది. లీటరు పెట్రోల్​పై రూ. 13, లీటరు డీజిల్​పై రూ.16 పెంచారు. ప్రస్తుత పెట్రో ధరల పెరుగుదలలో ఈ చర్య తీవ్ర ప్రభావం చూపింది.

ఇదీ చదవండి :'రిలయన్స్, ఫ్యూచర్​ మధ్య నారదుడిలా బెజోస్!'

ABOUT THE AUTHOR

...view details