తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2020, 6:36 PM IST

ETV Bharat / business

ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్​ బిడ్​

ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్ చివరి నిమిషంలో​ ఈఓఐ దాఖలు చేసింది. టాటా గ్రూప్​తో పాటు మరికొన్ని సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి.

Tata Sons among multiple bidders in race to buy Air India
ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్​ బిడ్​

భారీ అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్​ బిడ్​ దాఖలు చేసింది. టాటా గ్రూప్​తో పాటు మరికొన్ని సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్లు దాఖలు చేసినట్టు డీఐపీఏఎమ్​(డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ అసెట్​ మేనేజ్​మెంట్​) కార్యదర్శి తుహిన్​ కాంత పాండే వెల్లడించారు.

ఎయిర్​ఇండియా కొనుగోలుకు ఈఓఐ బిడ్ దాఖలు చేసేందుకు తుది గడువు.. సోమవారం సాయంత్రం 5 గంటలు. అయితే టాటా గ్రూప్​ చివరి నిమిషంలో బిడ్​ దాఖలు చేసినట్టు సమాచారం.

మరోవైపు బిడ్లు దాఖలు చేసిన ఇతర సంస్థల పేర్లు, మొత్తం దాఖలైన బిడ్ల గురించి పాండే స్పష్టతనివ్వలేదు. అదే సమయంలో టాటా గ్రూప్​.. ఒంటరిగా బిడ్​ దాఖలు చేసిందో లేక ఏదైనా విమానయాన సంస్థలో అనుసంధానమై ఈఓఐ వేసిందో ఇంకా తెలియరాలేదు.

ఈఓఐ బిడ్లకు అనుమతి పొందిన వారి వివరాలు జనవరి 6న తెలియనున్నాయి. అనంతరం వారు ఆర్థిక బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:-ఉద్యోగుల చేతికే ఎయిర్​ ఇండియా!

ABOUT THE AUTHOR

...view details