టాటాస్కై.. అన్ని డీటీహెచ్ ప్లాట్ఫామ్ల్లో కలిపి అత్యధిక సంఖ్యలో హెచ్డీ ఛానళ్లు కలిగి అగ్రపథాన దూసుకుపోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 100 హెచ్డీ ఛానళ్లలో 91 ఛానళ్లను తన వినియోగదారులకు అందిస్తోంది టాటాస్కై.ద్వితీయ స్థానంలో ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ఉంది.
ట్రాయ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ప్రవేశపెట్టిన 'కొత్త నియంత్రణ నిబంధనలు'... ప్రసారాలు(బ్రాడ్కాస్టింగ్), డీటీహెచ్ పరిశ్రమలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. ఇది పరిశ్రమ దృక్కోణాన్ని మార్చివేసింది. ఛానల్ ధరలు, సభ్యత్వాలు, అలాగే వినియోగదారులకు వేసే బిల్లుల విషయాల్లోనూ మార్పులు తీసుకొచ్చింది. ట్రాయ్ చేపట్టిన ఈ సంస్కరణలు డీటీహెచ్ పరిశ్రమలో మరింత పోటీ వాతావరణం ఏర్పడటానికి దోహదం చేశాయి.
ఫలితంగా చందాదారులకు ఆకర్షణీయమైన ధరల్లో, మరిన్ని సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో వినియోగదారుడు తనకు నచ్చింది ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం చందాదారులు ఎక్కువగా నాణ్యత, ధరలు, సేవలు ప్రాతిపదికలుగా చూసుకుంటున్నారు. కొంతమంది వినియోగదారులు మాత్రం ఒక నిర్దిష్ట డీటీహెచ్ ప్రొవైడర్ అందిస్తోన్న ఛానళ్ల సంఖ్యను చూస్తున్నారు. మీరు అలాంటి వినియోగదారుడైతే ఇది మీ కోసమే.
టాటా స్కై వర్సెస్ ఎయిర్టెల్ డిజిటల్ టీవీ