తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యధిక హెచ్​డీ ఛానల్స్​ అందించే డీటీహెచ్ ఆపరేటర్ ఇదే! - అత్యధిక హెచ్​డీ ఛానల్స్​ అందించే డీటీహెచ్ ఆపరేటర్ ఇదే!

దేశంలో ప్రస్తుతం అత్యధిక హెచ్​డీ ఛానళ్లు (91) అందిస్తున్న డీటీహెచ్ ఆపరేటర్​గా టాటా స్కై నిలిచింది. దీని తరువాత ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ (86 ఛానల్స్) రెండో స్థానంలో ఉంది. సన్​ డైరెక్ట్ 75, డిష్​ టీవీ 70 హెచ్​డీ ఛానళ్లను అందిస్తున్నాయి. డిష్​ టీవీలో భాగమైన డీ2హెచ్ కేవలం 64 హెచ్​డీ ఛానళ్లతో చివరి స్థానంలో నిలిచింది.

Tata Sky Continues to Offer Most Number of HD Channels to DTH Subscribers
అత్యధిక హెచ్​డీ ఛానల్స్​ అందించే డీటీహెచ్ ఆపరేటర్ ఇదే!

By

Published : Jan 26, 2020, 6:27 PM IST

Updated : Feb 25, 2020, 5:12 PM IST

2020 జనవరి 26 నాటికి దేశంలో అత్యధిక హెచ్​డీ ఛానళ్లను అందించే డీటీహెచ్ ఆపరేటర్​గా టాటాస్కై నిలిచింది. రెండో స్థానంలో ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ ఉంది.

కేవలం నాలుగు మాత్రమే

ప్రస్తుతం దేశంలో కేవలం నాలుగు పే డీటీహెచ్​ ఆపరేటర్లు మాత్రమే ఉన్నాయి. అవి టాటా స్కై, డిష్​ టీవీ (డీ2హెచ్​తో సహా), ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ, సన్​ డైరెక్ట్​.

హెచ్​డీ ఛానల్స్ పరంగా

ట్రాయ్​, సంబంధిత డీటీహెచ్ ఆపరేటర్ల వెబ్​సైట్​ నుంచి సేకరించిన డేటా ప్రకారం... 2020 జనవరి 26 నాటికి బ్రాడ్​కాస్టర్స్​ నుంచి లభించే 100 ఛానళ్లలో 91 హెచ్​డీ ఛానెల్స్​ను తన చందాదారులకు అందిస్తూ టాటా స్కై ప్రథమ స్థానంలో ఉంది. 86 హెచ్​డీ ఛానళ్లతో ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ రెండోస్థానంలో ఉంది.

ఓవరాల్​గా...

టాటా స్కై నెట్​వర్క్​లో మొత్తం ఎస్​డీ, హెచ్​డీ ఛానళ్లు 589 ఉండగా, ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ నెట్​వర్క్​లో 626 ఛానళ్లు ఉన్నాయి. ఎస్​డీ+హెచ్​డీ ఛానళ్ల పరంగా చూస్తే ఎయిర్​టెల్​ డిజిటల్​ టీవీనే మొదటిస్థానంలో ఉంటుంది.

చివరి స్థానంలో డీ2హెచ్​

సన్​ డైరెక్ట్ 75 హెచ్​డీ ఛానల్స్, డిష్​ టీవీ 70 హెచ్​డీ ఛానళ్లను అందిస్తున్నాయి. డిష్​ టీవీలో భాగమైన డీ2హెచ్ కేవలం 64 హెచ్​డీ ఛానళ్లను అందిస్తూ చివరి స్థానంలో నిలిచింది.

పోటాపోటీగా

టాటాస్కై, ఎయిర్​టెల్ డిజిటల్ టీవీలు... తమ వినియోగదారులకు ప్రీమియం సేవలు అందించడానికి పోటీ పడుతున్నాయి. ఆఫర్లలో సెట్​-టాప్ బాక్సులు, వారంటీ సేవలు, వివిధ ఛానళ్ల ప్యాక్​లను​ అందిస్తున్నాయి.

టాటా స్కై ఆఫర్​

టాటా స్కై ప్రస్తుతం తన హెచ్​డీ సెట్​-టాప్​ బాక్స్​పై పరిమిత కాల ఆఫర్​ను నడుపుతోంది. దీనిలో భాగంగా నూతన చందాదారులకు కొత్త హెచ్​డీ ఎస్​టీబీని రూ.1,399కే అందిస్తోంది. మాములుగా దాని ధర రూ.1,499.

కానీ మీరు ఎక్కువ ఎస్​డీ+హెచ్​డీ ఛానల్స్ చూడాలనుకుంటే మాత్రం ఎయిర్​టెల్ డిజిటల్ టీవీని ఎంచుకోవచ్చు. డిష్​ టీవీ, డీ2హెచ్​, సన్​ డైరెక్టు కొంత మేర ఆఫర్లు ఇస్తున్నప్పటికీ... ప్రత్యేకమైన (ఎక్స్​క్లూజివ్​) ఛానల్స్ అందించడంలేదు.

ఇదీ చూడండి: రక్తం గడ్డకట్టించే చలిలో జవాన్ల గణతంత్ర వేడుకలు

Last Updated : Feb 25, 2020, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details