తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా మోటార్స్​ ఈవీ వ్యాపారంలో రూ.7500 కోట్ల పెట్టుబడి

విద్యుత్​ వాహన విభాగానికి సంబంధించి టాటా మోటార్స్​.. టీపీజీ రైజ్​ క్లైమేట్​ సంస్థతో ఒప్పందం రూ.7500 కోట్ల కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు 18 నెలల వ్యవధిలో పలు దఫాలుగా జరుగుతాయి. మొదటి విడత పెట్టుబడుల ప్రక్రియ 2022 మార్చికి, పూర్తి పెట్టుబడులు 2022 చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది.

tata motors news
టాటా మోటార్స్​ ఈవీ వ్యాపారంలో రూ.7500 కోట్ల పెట్టుబడి

By

Published : Oct 13, 2021, 5:00 AM IST

ప్రయాణికుల విద్యుత్‌ వాహన విభాగంలోకి టీపీజ్‌ రైజ్‌ కైమేట్‌ నుంచి బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7500 కోట్లు) సమీకరించనున్నట్లు దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇందుకు టాటా మోటార్స్‌, ప్రైవేట్​ ఈక్విటీ సంస్థ టీపీజీకి చెందిన టీపీజీ రైజింగ్‌ క్లైమేట్‌లు బైండింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం.. టీపీజీ రైజ్‌ క్లైమేట్‌, సహ పెట్టుబడిదారు ఏడీక్యూ (అబుధాబి ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ)తో కలిసి కొత్తగా ఏర్పాటు కానున్న టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సంస్థ విలువను 9.1 బిలియన్‌ డాలర్లు (రూ.68,250 కోట్లు)గా లెక్కకట్టిన తర్వాత టీపీజీ గ్రూప్‌ అందులో 11-15 శాతం వాటా పొందనుంది.

ఈ పెట్టుబడులు 18 నెలల వ్యవధిలో పలు దఫాలుగా జరుగుతాయి. మొదటి విడత పెట్టుబడుల ప్రక్రియ 2022 మార్చికి, పూర్తి పెట్టుబడులు 2022 చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. తమ ప్రయాణంలో టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ చేరడం సంతోషకరమని, వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు వాహనాలు అందించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని టాటా మోటార్స్​ ఛైర్మన్​ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2030కి మొత్తం వాహనాల్లో 30 శాతం విద్యుత్​ వాహనాలను తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యంలో కీలక పాత్ర పోషించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి :తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం- పారిశ్రామికోత్పత్తి జోరు

ABOUT THE AUTHOR

...view details