దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎస్యూవీ విభాగంలో మరో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. హారియర్ ఎక్స్‌టీ ప్లస్ పేరుతో ఈ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు టాటా మోటార్స్ శుక్రవారం ప్రకటించింది.
ఈ మోడల్ ప్రారంభ ధర రూ.16.99 లక్షలు (దిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది టాటా మోటార్స్. ఎక్స్‌టీ ప్లస్ వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్ సహా మరిన్ని కొత్త ఫీచర్లు పొందుపరిచినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ప్రకటించిన ప్రారంభ ధర సెప్టెంబర్‌లోపు కారు బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. వారికి డిసెంబర్ 31 లోపు కారు డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి ఈ మోడల్ ధరలు పెంచనున్నట్లు వివరించింది.