తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త సంవత్సరంలో కార్ల ధరలకు రెక్కలు! - టాటా కార్ల ధరలు

Car Costs Increase: కొత్త సంవత్సరంలో కార్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి సంస్థలు తమ కార్ల ధరల్ని జనవరి నుంచి పెంచనున్నట్లు ప్రకటించగా.. ఇదే బాటలో టాటా మోటార్స్​, హోండాలు కూడా సిద్ధమవుతున్నాయి.

Car Costs Increase
పెరగనున్న కార్ల ధరలు

By

Published : Dec 5, 2021, 3:19 PM IST

Car Costs Increase: నూతన సంవత్సరంలో కార్ల ధరలను పెంచుతున్నట్లు కొన్ని దిగ్గజ సంస్థలు ప్రకటించగా.. వాటిలో దారిలోనే నడవాలని టాటా మోటార్స్​, హోండా, రెనాల్ట్​ భావిస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం సహా కార్లలో సదుపాయాలు పెంచడం కోసం ఖర్చు పెరిగినందున.. ధరలు పెంచడం మార్గంమనే యెచనలో ఆయా సంస్థలు ఉన్నాయి.

మారుతీ సుజుకీతోపాటు విలాస కార్లను ఉత్పత్తి చేసే మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి సంస్థలు తమ కార్ల ధరల్ని జనవరి నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ మోడళ్ల ధర పెరగనున్నట్లు మారుతీ చెప్పగా.. మెరుగైన ఫీచర్లు, పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు పెరగడం కారణంగా కేవలం ఎంపిక చేసిన మోడళ్లపై 2శాతం వరకు పెంచిన ధర వర్తిస్తుందని మెర్సిడెస్​ బెంజ్ తెలిపింది. మరోవైపు ఒక్కొక్క కారుపై మూడు శాతానికిపైగా ధరలు పెంచుతున్నట్లు ఆడి ప్రకటించింది. పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయిని స్పష్టం చేసింది.

కమోడిటీస్ ధరలు, ముడిసరకు, ఇతర ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయి. దీంతో నష్టాలను పూడ్చుకునేందుకు ధరల పెంపు అనివార్యం కానున్నట్లు టాటా మోటార్స్​కు చెందిన శైలేష్ చంద్ర తెలిపారు. దేశీయ మార్కెట్‌లో కంపెనీ పంచ్, నెక్సాన్, హారియర్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది.

భవిష్యత్తులో తమ కార్లపై కూడా ధరలను పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా పేర్కొంది. కమోడిటీల ధరలు పెరిగిన కారణంగా ఇన్‌పుట్ ధరపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కార్ల ధరలను పెంచే విషయాన్ని సంస్థ పరిశీలిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆగస్టులో ధరలను పెంచాయి.

కార్ల తయారీలో ఉపయోగించే ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్​లతో పాటు వివిధ లోహాల ధరలు బాగా పెరిగాయి. వాహన తయారీలో 75-80 శాతం వాటా ఈ లోహాలదే. దీంతో ఉత్పత్తి వ్యయం భారమైందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

Tariff Hike: ఛార్జీల పెంపుతో టెల్కోలకు ఎంత లాభం?

Jio Recharge Cashback Offers: ఆ రీఛార్జ్​లపై 20% జియో క్యాష్​బ్యాక్​

IPOs in 2021: ఐపీఓల జోరు.. పెట్టుబడిదారుల హుషారు!

ABOUT THE AUTHOR

...view details