టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి ప్రవేశించింది. ఆల్ట్రోజ్‌ను రూ.5.29 లక్షల (ఎక్స్-షోరూమ్ ఇండియా) ప్రారంభ ధరతో విడుదల చేసింది. లీడింగ్ డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, డ్రైవింగ్ డైనమిక్స్ దీని ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది.
గతేడాది డిసెంబర్లో ఆవిష్కరించిన ఆల్ట్రోజ్.. పరిశ్రమలోనే మొట్టమొదటి బీఎస్-6 డీజిల్-రెడీకారుగా నిలిచింది. టాటా మోటార్స్ బ్రాండ్‌కు చెందిన (ఆల్ఫా ప్లాట్‌ఫాం) మొదటి మోడల్ కూడా ఇదే. అలాగే ఇంపాక్ట్ 2.0 డిజైన్ కలిగిన రెండో వాహనం కూడా ఇదే కావడం విశేషం.
"మార్కెట్ కష్టాల్లో ఉన్న సమయంలో మా ఉత్పత్తిని తీసుకొస్తామని చెప్పాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త తరం బీఎస్-6 వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చాం. మా మార్కెట్ కవరేజీని మరింత విస్తరిస్తాం. "
- గుంటెర్ బుట్షెక్, టాటా మోటార్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్
ఇక్కడ లభిస్తుంది..
ఆల్ట్రోజ్ అన్ని టాటా మోటార్స్ అధీకృత డీలర్‌షిప్‌లలో 5 ట్రిమ్ స్థాయిల్లో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఆల్ట్రోజ్‌లో రిథమ్, స్టైల్, లగ్జరీ, అర్బన్ అనే నాలుగు ప్యాక్‌లు ఉంటాయి. వీటిలో ఒకటి ఎంపిక చేసుకుని ఆరు వేర్వేరు ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ కస్టమైజబుల్ ఆప్షన్స్ తీసుకోవచ్చు.
మొదటి 'ఓఈఎమ్'గా టాటా మోటార్స్