తెలంగాణ

telangana

ETV Bharat / business

మైండ్​ట్రీ-ఎల్​అండ్​టీ రచ్చ - ఎల్​ అండ్​ టీ

ప్రముఖ ఐటీ సంస్థలు మైండ్​ ట్రీ-ఎల్​ అండ్​ టీ మధ్య వివాదం ముదురుతోంది. మైండ్​ట్రీ టేకోవర్​కు ఎల్​ అండ్​ టీ చేస్తున్న ప్రయత్నాలను ప్రమోటర్లు వ్యతిరేకిస్తున్నారు.

మైండ్​ ట్రీ-ఎల్​ అండ్​ టీ

By

Published : Mar 19, 2019, 4:00 PM IST

Updated : Mar 19, 2019, 8:58 PM IST

మెండ్ ​ట్రీ- ఎల్​ అండ్​ టీ టేకోవర్​ వివాదం ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సంస్థ టేకోవర్​కు ఎల్​ అండ్​ టీ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు మైండ్ ​ట్రీ ప్రకటన విడుదల చేసింది.

"మైండ్​ ట్రీ సంస్థను టేకోవర్​ చేసుకోవటానికి ఎల్​ అండ్​ టీ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంస్థకి టేకోవర్​ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇదే కనుక జరిగితే 20 సంవత్సరాల పాటు పడిన కష్టం వృధా అవుతుంది. అందుకే ఎల్​ అండ్​ టీ చర్యను వ్యతిరేకిస్తున్నాం" అని మైండ్​ ట్రీ ప్రమోటర్లు ప్రకటన విడుదల చేశారు.

ఒక వేళ మైండ్​ ట్రీ సంస్థని ఎల్​ అండ్​ టీ టేకోవర్​ చేయగలిగితే దేశంలో ఇప్పటివరకు జరిగిన ఐటీ ఒప్పందాల్లో ఇదే అతి పెద్దదిగా నిలుస్తుంది.

66 శాతం వాటా కొనుగోలుకు మైండ్​ ట్రీ సంస్థకు ఎల్​ అండ్​ టీ 10,800 కోట్లు ఇస్తామని తెలిపింది. అయితే దీనిని మైండ్​ ట్రీ సంస్థ తిరస్కరించింది.

మైండ్​ ట్రీ లో 20.32 శాతం కలిగిన క్యఫే​ కాఫీ డే అధిపతి విజి సిదార్థతో ఒప్పందం కుదుర్చకుంది ఎల్​ అండ్​ టీ. బహిరంగ​ మార్కెట్​ ద్వారా మరో 15 శాతం వాటాల కొనుగోలుకు ఆర్డర్​ చేసింది. మరో 31 శాతాన్ని ఓపెన్​ మార్కెట్ల ద్వారానే సమకూర్చుకోవాలని ఆలోచిస్తోంది ఎల్​ అండ్​ టీ.

ఎల్​ అండ్ టీ​ స్పందన:

మైండ్ ట్రీ టేకోవర్​ ఒప్పందంపై స్పందించింది ఎల్​ అండ్​ టీ. టేకోవర్​ జరిగితే మైండ్​ ట్రీ సంస్థని ఎల్​ అండ్​ టీ ఇన్ఫోటెక్​లో విలీనం చేయబోమని ప్రకటించింది. అదేవిధంగా ఎల్​ అండ్​ టీ స్థిరమైన సంస్థ అని మైండ్​ ట్రీ ఉద్యోగులు భవిష్యత్​పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది

Last Updated : Mar 19, 2019, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details