తెలంగాణ

telangana

ETV Bharat / business

స్విగ్గీ డెలివరీ విమెన్‌కు రెండురోజుల నెలసరి సెలవులు - స్విగ్గీ నెలసరి సెలవులు

మహిళలకు నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' తన వద్ద పనిచేసే డెలివరీ విమెన్‌ సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఈ విషయాన్ని స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్‌ షా తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించారు.

swiggy
స్విగ్గీ

By

Published : Oct 22, 2021, 8:00 PM IST

నేడు మహిళలు పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే నెలసరి వంటి వ్యక్తిగత సమస్యతో కొన్నిసార్లు మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆ రోజుల్లో సెలవు అడగాలంటే కారణం ఏం చెప్పాలో.. చెబితే ఏం అనుకుంటారో అన్న అనుమానం. మహిళలకు ఎదురయ్యే ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' తన వద్ద పనిచేసే డెలివరీ విమెన్‌ సౌకర్యార్థం మంచి నిర్ణయం తీసుకుంది. మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్‌ షా తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించారు.

"నెలసరి సమయంలో బయటకు రావాలన్నా.. రోడ్లపై తిరగాలన్నా మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతారు. డెలివరీని మహిళలు వృత్తిగా ఎంచుకోకపోవడానికి బయటి చెప్పుకోలేని ప్రధాన కారణం ఇది. అలాంటి మహిళలకు అండగా ఉండాలని మేం నిర్ణయం తీసుకున్నాం. మహిళలు ఒక అడుగు ముందుకేసినప్పుడు.. మనమెందుకు వేయకూడదు. అందుకే మా రెగ్యులర్‌ డెలివరీ విమెన్‌కు ప్రతినెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించాం. ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఈ సెలవులను వారు ఉపయోగించుకోవచ్చు" అని మిహిర్‌ తెలిపారు.

దీంతో పాటు మహిళా ఉద్యోగుల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రత కోసం వారి పని గంటలను సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేసినట్లు తెలిపారు. రాత్రివేళల్లో తమకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ.. మహిళలను ఆ సమయంలో డెలివరీ చేయనివ్వబోమని చెప్పారు.

2016 నుంచి స్విగ్గీ డెలివరీల కోసం మహిళలను కూడా విధుల్లోకి తీసుకుంది. తొలి ప్రయత్నంలో పుణెలో ఆరంభించి.. ఆ తర్వాత ఇతర ప్రధాన నగరాల్లోనూ డెలివరీ విమెన్‌ను తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో నెటిజన్లు స్విగ్గీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details