తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​ బ్యాంకు ఖాతాదారుల డబ్బు భద్రం: ఆర్బీఐ - yes bank

ఎస్​ బ్యాంకు ఖాతాదారుల డబ్బు పూర్తిగా భద్రమని భరోసా కల్పించారు రిజర్వ్​ బ్యాంక్​ గవర్నర్​ శక్తికాంత దాస్​. ఈ బుధవారం సాయంత్రం మారటోరియం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సాధారణంగానే తమ డబ్బును విత్​డ్రా చేసుకోవచ్చని తెలిపారు.

RESERVE BANK OF INDIA
కరోనా వ్యాప్తిపై ఆర్​బీఐ సమీక్ష

By

Published : Mar 16, 2020, 4:36 PM IST

ఎస్​ బ్యాంకుపై ఉన్న మారటోరియాన్ని ఈనెల 18 (బుధవారం) సాయంత్రం 6 గంటలకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ శక్తికాంత దాస్​. ఖాతాదారుల డబ్బు సురక్షితమని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు గవర్నర్​.

" ఎస్​ బ్యాంకుపై కేంద్రం, ఆర్​బీఐ సరైన సమయంలో సత్వర చర్యలు తీసుకుంది. బ్యాంకు కొత్త బోర్డు ఈనెల 26న బాధ్యతలు తీసుకుంటుంది. ఖాతాదారుల డబ్బు పూర్తిగా భద్రం. ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. బుధవారం సాయంత్రం నుంచి మామూలుగానే విత్​డ్రా చేసుకోవచ్చు. భారత బ్యాంకింగ్​ వ్యవస్థ చాలా భద్రంగా ఉంది. దేశంలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర కీలకం."

- శక్తికాంత దాస్,​ ఆర్బీఐ గవర్నర్​.

ABOUT THE AUTHOR

...view details