తెలంగాణ

telangana

ETV Bharat / business

బీఎస్​-6 వెర్షన్​లో 'సుజుకీ యాక్సెస్ 125'- ధర తెలుసా? - సుజుకీ తన తొలి బీఎస్-6 వాహనాన్ని విడుదల చేసింది.

సుజుకీ తన తొలి బీఎస్-6 వాహనాన్ని విడుదల చేసింది. సుజుకీ యాక్సెస్-125 వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ వాహన ధర మోడల్​ను బట్టి 64,800 నుంచి 69,500 మధ్య ఉన్నట్లు తెలిపింది.

Suzuki Motorcycle India launches BS-VI version of scooter Access 125, priced up to Rs 69,500
బీఎస్​-6 వెర్షన్​లో 'సుజుకీ యాక్సెస్ 125'- ధర తెలుసా?

By

Published : Jan 6, 2020, 6:38 PM IST

సుజుకీ సంస్థ మార్కెట్​లోకి తన తొలి బీఎస్​-6 వాహనం 'సుజుకీ యాక్సెస్ 125' స్కూటర్​ను ప్రవేశపెట్టింది. దీని ధర 64,800 నుంచి 69,500(ఎక్స్​ షోరూం దిల్లీ) మధ్య ఉన్నట్లు తెలిపింది. ఈ నూతన బీఎస్-6 వాహనం స్టాండర్డ్, స్పెషల్ వేరియంట్లలో(అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ స్టీల్ డ్రమ్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్​) లభించనున్నట్లు పేర్కొంది.

"సుజుకీ మోటర్ సైకిల్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధిలో సుజుకీ యాక్సెస్ 125 ప్రధాన భాగస్వామి. ఈ వాహనానికి వినియోగదారుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. సుజుకీ యాక్సెస్ 125 బీఎస్-6 వాహనాల ద్వారా కూడా వినియోగదారుల అంచనాలను అందుకుంటాం."
-కొయిచిరొ హిరావో, సుజుకీ ఎండీ

బీఎస్​-6 రెగ్యులేటరీ ప్రమాణాల ప్రకారం సుజుకీ సంస్థ నూతన ఫ్యామిలీ స్కూటర్​ను పరిచయం చేసినట్లు హిరావో తెలిపారు. దీంతో తమ ఉత్పత్తులన్నింటినీ నూతన ప్రమాణాల ప్రకారం తయారుచేయనున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్​-6 వాహన ప్రమాణాలు అమలులోకి రానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details