దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును సెప్టెంబరు 30 వరకు కొనసాగిస్తున్నట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే పరిమిత మార్గాల్లో మాత్రమే కొన్ని పాసింజర్ విమానాలు నడపనున్నట్లు తెలిపింది.
సెప్టెంబరు 30 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్ - International flights suspension news
కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల విమాన సర్వీసుల రద్దును సెప్టెంబరు 30 వరకు కొనసాగిస్తున్నట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే కొన్ని ప్రయాణికుల విమానాలు నడపనున్నట్లు తెలిపింది.
![సెప్టెంబరు 30 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్ Suspension of scheduled international passenger flights extended till Sept 30](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8626507-thumbnail-3x2-flights.jpg)
సెప్టెంబరు 30 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత ఆ ఆంక్షలను రెండు సార్లు (జులై 31, ఆగస్టు 31 వరకు) పొడిగిస్తూ వచ్చింది డీజీసీఏ. తాజాగా సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి:'అమర వైద్యుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం!'