తెలంగాణ

telangana

ETV Bharat / business

'చక్రవడ్డీ' మాఫీ అంశంలో కేంద్రంపై సుప్రీం అసంతృప్తి - రుణాల వడ్డీపై వడ్డీ మాఫీ

మారటోరియం సమయంలో వివిధ రుణాల వడ్డీపై వడ్డీ మాఫీ అంశంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్​లో సమగ్ర వివరాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. కమత్​ కమిటీ నివేదికను కోర్డు ముందు ఉంచలేదని వ్యాఖ్యానించింది. అదనపు అఫిడవిట్​ దాఖలు చేయాలని ఆదేశించింది.

maratorium
కేంద్రంపై సుప్రీం అసంతృప్తి

By

Published : Oct 5, 2020, 12:52 PM IST

మారటోరియం కాలంలో రుణాల వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాల వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తామని కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించింది. సెప్టెంబర్‌10వ తేదీన కోర్టు అడిగిన సమగ్ర వివరాలన్ని అఫిడవిట్‌లో లేవని.. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కమత్ ‌కమిటీ నివేదికను కోర్టు ముందు ఉంచలేదని వ్యాఖ్యానించింది. కొన్ని రంగాలను పట్టించుకోలేదన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది.

ఈ నేపథ్యంలో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేస్తామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. మరోవైపు కేంద్రం అఫిడవిట్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు పిటిషనర్లకు కోర్టు వారం రోజులు గడువు ఇచ్చింది. నిర్ణయాల అమలు సర్కులర్లు, మార్గదర్శకాలతో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: రుణగ్రహీతలకు కేంద్రం భారీ ఊరట!

'వడ్డీ వసూలు చేస్తే మారటోరియంతో ప్రయోజనమేంటి?'

ABOUT THE AUTHOR

...view details