పదవీ విరమణ ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందు గుర్తొచ్చే పథకాలు ఈపీఎఫ్, ఎన్‌పీఎస్, పీపీఎఫ్లు. అయితే వీటితో పాటు మరొక పథకం 'సూపర్ యాన్యుయేషన్' గురించి తెలుసుకున్నారా? మీరు ఉద్యోగం చేసే సంస్థ ఎల్ఐసీ తో సూపర్‌యాన్యుయేషన్ పథకాన్ని నిర్వహిస్తే మీ ఖాతాలో ఉండే మొత్తాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం . సాధారణంగా చాలా మంది ఉద్యోగులు ఈ మొత్తం ఎంతనేది తెలుసుకోకపోవడమో లేదా ఇలాంటిది ఒకటి ఉన్నట్లు వారికి తెలియకపోవడమో జరగవచ్చు. ఈ పథకం ద్వారా వచ్చే మొత్తాన్ని తెలుసుకోవడం ద్వారా మీ పదవీవిరమణ ప్రణాళికను మరింత కచ్చితంగా అమలు చేయోచ్చు. ఈ మొత్తం మీ పోర్ట్‌ఫోలియోలో ఒక పెద్ద భాగం అవ్వచ్చు. ఉద్యోగులకు తమ సంస్థల ద్వారా అందే బెనిఫిట్‌గా దీన్ని చెప్పవచ్చు. ఉద్యోగి తరపున సంస్థ ఈ పథకంలో ఏటా కొంత మొత్తం చెల్లింపులు చేస్తారు. పదవీ విరమణ నిధికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది.
ప్రత్యేకతలు:
- సూపర్‌యాన్యుయేషన్ ఫండ్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చే పదవీ విరమణ ప్రయోజనం.
- సాధారణంగా సంస్థలు ఎల్ఐసీ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ లాంటి వాటితో అనుసంధానమై ఉంటాయి.
- సంస్థలు బేసిక్ శాలరీలో 15% చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి ఏ విధమైన చెల్లింపులు చేయనవసరం లేదు.
- ముందుగా నిర్ణయించిన నమూనా ప్రకారం ఈ మొత్తాన్ని వివిధ పెట్టుబడుల్లో ఫండ్ మదుపు చేస్తుంది.
- దీనిపై లభించే వడ్డీ రేటు, పీఎఫ్ వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది.
- పదవీ విరమణ వయసు రాగానే, తమ ఖాతా ద్వారా లభించే మొత్తం లో 25% పన్ను మినహాయింపు ప్రయోజనం పొందేందుకు అర్హులు. 75% యాన్యూటీ ఫండ్లో పెట్టుబడి చేస్తారు. యాన్యుటీ రాబడి సభ్యుని ఎంపిక చేసుకునే దాన్ని బట్టి నెలసరి/త్రైమాసికానికి ఉంటుంది. ఈ మొత్తంపై పన్ను ఉంటుంది.
- ఉద్యోగం మారినపుడు ఆ ఖాతానే తరువాత కూడా కొనసాగించవచ్చు. ఉద్యోగి తన మొత్తాన్ని కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. కొత్తగా వెళ్లే సంస్థలో సూపర్ యాన్యుయేషన్ పథకం లేకపోతే, అప్పుడు ఉద్యోగి ఖాతాలో మొత్తం సొమ్ముని ఉపసంహరించుకోవచ్చు, ఆదాయపు పన్ను శాఖ ఆమోదంతో పన్ను మినహాయింపుతో నిధులు పొందవచ్చు. వయస్సు పూర్తయ్యే వరకూ ఈ ఖాతాను కొనసాగించవచ్చు.
పదవీ విరమణ తర్వాత సూపర్‌యాన్యూయేషన్ ఏమవుతుంది?
మీరు పదవీవిరమణ చేశాక మొత్తాన్ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు:
- మొదటి విధానంలో పూర్తిగా ఒకేసారి మొత్తం తీసుకోవచ్చు. అలాంటపుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- రెండో విధానంలో 1/3 వ వంతు పన్ను లేకుండా తీసుకుని మిగిలిన మొత్తం 2/3 రెగ్యులర్ పెన్షన్ పథకంలో పెట్టుబడిగా ఉంచొచ్చు. పన్ను చెల్లింపులో 2/3 వంతు పెట్టుబడి చేయడం ద్వారా వచ్చే రాబడిపై పన్ను చెల్లించాలి.
ఉద్యోగం మారితే?
చాలామంది ఉద్యోగులకు ఎదురయ్యే ప్రశ్న. మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు, మీ సూపర్ యాన్యుయేషన్ను పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు బదిలీ చేయవచ్చు. ఆ పథకాన్ని పదవీ విరమణ వరకు కొనసాగించవచ్చు.
కొత్తగా చేరే సంస్థలో సూపర్ యాన్యూయేషన్ లేనట్టయితే 2 మార్గాలు ఉన్నాయి. డబ్బును తీసుకోవడం (పన్ను ఉంటుంది.) లేదా ఆ ఫండ్లో పథకాన్ని కొనసాగించడం. మీ పదవీ విరమణ తర్వాత ఆ మొత్తాన్ని తీసుకోవడం .
ఎలా లెక్కిస్తారు?