ప్రముఖ చైనా వీడియో యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం గూగుల్‌కు లేదని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ సెప్టెంబర్ 15లోగా అమెరికాలో కార్యకలాపాలను మూసివేయాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, మైక్రోసాఫ్ట్, ట్విటర్ తదితర అమెరికా సంస్థలు దానిని చేజిక్కించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
టిక్‌టాక్ కొనుగోలు రేసులో గూగుల్..! - titok partnership with google
టిక్‌టాక్‌ను గూగుల్ కొంటోందని వచ్చిన వార్తలపై సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వివరణ ఇచ్చారు. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం తమ సంస్థకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

చైనా టిక్‌టాక్‌ను కొంటున్న గూగుల్?
ఈ నేపథ్యంలో ఓ అన్‌లైన్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో.. గూగుల్ కూడా ఈ రేసులో ఉందా అనే ప్రశ్నకు పిచాయ్ స్పందించారు. ఈ యాప్ తమ క్లౌడ్ సర్వీసెస్ సేవలను ఉపయోగించుకుంటోందని, అందుకు రుసుము చెల్లిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఆ సంస్థను కొనుగోలు చేసే ఆలోచనలో గూగుల్ లేదని పిచాయ్ వెల్లడించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ గ్రూప్ బిడ్‌లో చేరుదామని తొలుత భావించినా.. అనంతరం విరమించుకున్నట్టు తెలిసింది.
ఇదీ చదవండి: టిక్‌టాక్ సీఈఓ పదవికి కెవిన్ రాజీనామా.. కారణమిదే