వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు.. ప్రస్తుతం వీటిని వాడని వారు ఉండటం లేదు. వీటి ద్వారా మొబైల్, టీవీల్లో నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు చూడవచ్చు. కరోనా కారణంగా వీటి ఉపయోగం పెరిగిపోయింది. ఒకటికన్నా ఎక్కువ ప్లాట్‌ఫామ్‌లను ఒకేసారి ఉపయోగించే వారు కూడా ఉన్నారు. అయితే ఈ సర్వీసులపై పెట్టే ఖర్చును ఆదా చేసుకోవటం ఎలానో చూద్దాం.
నచ్చిన సినిమాలు, సిరీస్‌లు, షోలు నచ్చిన సమయంలో చూసేందుకు ఉద్దేశించినివే వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ-హాట్‌స్టార్ వంటివి దేశంలో అనేక ఫ్లాట్‌ఫామ్‌లు ఈ సర్వీసులను అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగినప్పటి నుంచి వీటి సబ్స్క్రిప్షన్లు పెరుగుతున్నాయి.
వీడియో స్ట్రీమింగ్ సర్వీసులకు సంబంధించి… వార్షిక, నెలవారీ, త్రైమాసిక ఇలా పలు రకాల ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. చూసే వీడియో క్వాలిటీని బట్టి సబ్స్క్రిప్షన్ ఛార్జీలుంటాయి. కొన్ని ప్లాన్లకు ఛార్జీలు ఎక్కువగా ఉండగా.. మరికొన్నింటికి తక్కువ మొత్తం ఛార్జీ అవుతుంది. పలు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎక్కువ ఛార్జీలు చెల్లించకుండా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. వాటిలో కొన్ని..
షేరింగ్..
చాలా సర్వీసులు ఒకే సారి ఒకరి కంటే ఎక్కువ మంది వినియోగించేలా ఉంటాయి. వీటిని ఒక్కరే ఉపయోగించకుండా స్నేహితులు, కుటుంబసభ్యులు.. ఇలా పలువురితో పంచుకోవటం వల్ల ఛార్జీలు అందరూ భరించవచ్చు. ఇలా కాని పక్షంలో ఒకరు మాత్రమే ఉపయోగించుకునే ప్లాన్‌ను తీసుకోవచ్చు. వీటికి సాధారణంగా తక్కువ సబ్స్క్రిప్షన్ ఛార్జీ ఉంటుంది.
ఫ్యామిలీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. వీటిని సాధారణంగా ఒకే సారి ఒకరి కంటే ఎక్కువ మంది ఉపయోగించుకునే వీలుంటుంది.
అవసరం లేని వాటిని తొలగించటం…
కొంత మంది సబ్స్క్రిప్షన్ తీసుకొని వాటిని వాడరు. అయినా ప్లాన్‌కు అనుగుణంగా ఛార్జీలు చెల్లిస్తునే ఉంటారు. అయితే అవసరం లేని సర్వీసులు రద్దు చేసుకోవటం వల్ల కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే ఏమైనా సర్వీసులపై ఎక్కువ చెల్లిస్తున్నామా? లేదా? సరిచూసుకుని మనకు అనుగుణంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి.
అదే ఉత్తమమం..