తెలంగాణ

telangana

ETV Bharat / business

నేడు జీఎస్​టీ మండలి భేటీ- రాష్ట్రాల పరిహారంపై చర్చ

నేడు జీఎస్​టీ మండలి 41వ సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరగనున్న ఈ భేటీలో.. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారంపై అధికారులు చర్చించనున్నారు. ఈ విషయంపై భాజపాయేతర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

Stormy GST Council meet in offing; revenue shortfall, compensation to be discussed
నేడు జీఎస్​టీ మండలి భేటీ- రాష్ట్రాల పరిహారంపై చర్చ

By

Published : Aug 27, 2020, 6:06 AM IST

జీఎస్​టీ(వస్తు సేవల పన్ను) మండలి 41వ సమవేశం నేడు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరగనుంది. జీఎస్​టీ అమలు వల్ల నష్టపోయిన ఆదాయానికి హామీ ఇచ్చినట్టుగా పరిహారాన్ని ఇవ్వాలని భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదే విషయమై సమావేశంలోనూ చర్చలు జరగనున్నాయి. మార్కెట్ల నుంచి రుణాలు తీసుకోవడం, సెస్​ రేట్లను పెంచడం, పరిహార​ సెస్​లోకి మరిన్ని వస్తువులను చేర్చే అంశాలను ఈ భేటీలో అధికారులు పరిశీలించనున్నారు.

జీఎస్‌టీ ప్రవేశ పెట్టిన క్రమంలో.. ఆదాయం తగ్గితే రాష్ట్రాలకు అయిదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ పరిహార నిధికి రాబడి తగ్గడం వల్ల సమస్య ఏర్పడింది. కొవిడ్‌ సంక్షోభం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో పరిహార నిధి కోసం మార్కెట్‌ నుంచి రుణాలు సమీకరించేందుకు ఉన్న చట్టబద్ధతపై అభిప్రాయం తెలపాలని గత మార్చిలో ఏజీ అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత కేంద్రానికి లేదని ఏజీ తెలిపినట్లు సమాచారం.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details