అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా ర్యాలీ చేసింది.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 356 పాయింట్లు లాభపడి 31 వేల 29 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 105 పాయింట్లు వృద్ధిచెంది 9 వేల 145 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయంగా లాక్డౌన్ సడలింపులు కొనసాగుతుండడం, వ్యాపారావకాశాలు మెరుగవుతుండడం మదుపరుల సెంటిమెంటును పెంచిందని వ్యాపార వర్గాలు తెలిపాయి.
ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా సోమవారం.. దేశీయ మార్కెట్లు ట్రేడింగ్ జరుపలేదు.
లాభనష్టాల్లో
ఐటీసీ, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్ రాణిస్తున్నాయి.